అబ్రహాము బలిగా అర్పించదలుచుకున్నది ఇస్సాకునా లేక ఇష్మాయేలునా?

0
156

క్రైస్తవులు గాని, యూదులు గాని అంగీకరించే విషయము యేదనగా “దేవుని స్నేహితుడని పిలువబడే అబ్రహాము తన ప్రియ కుమారుడైన ఇస్సాకును దేవుని కొరకు బలిగా అర్పించదలుచుకున్నాడు” అని. ఈ విషయములో క్రైస్తవులకు గాని, యూదులకు గాని ఎటువంటి భేదం లేదు అయితే ముస్లింలకు మాత్రం ఒక సమస్య వుంది అదేదనగా అబ్రహాము బలిగా అర్పించదలుచుకున్నది “ఇష్మాయేలుని గాని ఇస్సాకును కాదు అనేది”. కాబట్టి ముస్లింలు వారి కురాను ను తప్పులు లేని మత గ్రంధముగా నిరూపించుకోవాలి గనుక బైబిల్ ను తప్పు పట్టటం మొదలు పెట్టారు. వీరి వాదన యేదనగా బైబిల్ని శాస్త్రులు వారి చేవ్రాతతతో పూర్తిగా కలుషితం చేసారు, ఇప్పుడున్న బైబిల్ ఆదిలో ఉన్నటువంటి బైబిల్ కాదు పూర్తిగా మార్చివేసారు అనేది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే “ముస్లింల విశ్వాసం యేదనగా బైబిల్ దేవుడు, కురాన్ దేవుడు ఒక్కటే”. సరే మరి ఒకే దేవుడని నమ్మితే అదే దేవుడు బైబిల్ ని కలుషితం చేసి, కురాన్ ని మాత్రం కాపాడతాడ మీరే చెప్పండి. సర్వశక్తి వంతుడైన దేవునికి తన నోటి వూపిరిచే కలిగిన బైబిల్ ని కాపాడుకునేంత కనీస శక్తి లేదా మీరే ఆలోచించండి. ఎప్పుడైనా సత్యం అనేది ఏదైనా వుంటే సాక్ష్యాలతో నిరూపించుకోవాలే గాని ఎదుట వారిని తప్పు పడితే మనది సత్యం అయిపోతుంది అన్న వ్యర్ధపు ఆలోచనలు మనం మానుకోవాలి. తెలుగులో దావా చేస్తూ బైబిలు నందు గొప్ప జ్ఞానం గల వాడిని అని ఊదర గొడుతున్న బ్రదర్. షఫీ గారు ఈ సత్యాన్ని గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. ఈయన గారు తెలుగులో చేసిన ఎవరు అబ్రహాముచే బలిగా అర్పింపబడినది? ఇస్సాకునా, ఇష్మాయేలునా? అన్న ప్రసంగములో ఆయనకు ఇష్టం ఉన్నటువంటి వాటిని ROMAN CATHOLIC బైబిల్ నుండి ఇష్టం లేనటువంటి వాటిని PROTESTANT బైబిల్ నుండి చూపించి జనాన్ని మోసం చేయటం మీరు చూసే ఉంటారు (చూడకపోతే ఇక్కడ చూడవచ్చు http://www.youtube.com/watch?v=ynhKjYgeHNU). ఈ మహాజ్ఞాని తన ప్రసంగములో చెప్పింది యేదనగా Protestant బైబిల్, Catholic బైబిల్ తరువాత వచ్చిందంట. బైబిల్ చరిత్ర ఏ క్రైస్తవుడికి కూడా తెలియదు అని ఈయన గారి నమ్మకం కాబోలు. దేవునిచే ఎన్నుకోబడిన యూదులు యేసయ్య పుట్టుక ముందు నుండి ఇప్పటివరకూ కూడా ఏదైతే (Official Jews Hebrew Bible) దేవుని గ్రంథం అని విస్వసిస్తున్నారో కచ్చితంగా అవే పుస్తకాలు, అవే వచనాలతో ఉన్నటువంటి “PROTESTANT” బైబిల్ని ఈ రోజు మనం చదువుకుంటున్నాము. Roman Catholic లు క్రీ.శ 1545-63 మధ్యన జరిగిన “Council of Trent” సమావేశంలో 7 పుస్తకాలను అదనముగా చేర్చారు. ఈ విషయాలన్నీ స్పష్టముగా షఫీ గారికి తెలుసు, కాని ఏమి తెలియని అమాయకుడి వలె బొజ్జ మీద చేయి పెట్టుకొని వినయముగా ప్రసంగిస్తూ ఉంటారు. అయితే మొదటి శతాబ్దపు యూదులు, క్రైస్తవులు విశ్వసించిన Hebrew Bible నందు గల పుస్తకాలను నమ్మాలా? లేక క్రీ.శ 1545-63 మధ్య చేర్చబడిన “Catholic Bible” ని నమ్మాలో మీరే ఆలోచించుకోవాలి. సరే ఇప్పుడు వీరి అసలైన వాదనను విశ్లేషిద్దాం.

ఆదికాండము 22: 2
“అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పింపమని చెప్పెను.

హెబ్రీయులకు 11: 17
“అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సా కును బలిగా అర్పించెను”.

యాకోబు 2: 21
“మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?”.

ముస్లింలు బైబిల్ ను తప్పు పట్టుటకు ఒక కొత్త సంగతిని లేవనెత్తారు అదేదనగా “ఏకకుమారుడు” అని బైబిల్ నందు కలదు కనుక ఏకకుమారుడు అనగా మొదటి కుమారుడు అని అర్ధం వస్తుంది కనుక కచ్చితంగా అబ్రహాము బలిగా అర్పించదలుచుకుంది ఇష్మాయేలునే” అని. అసలు ఏకకుమారుడు అనగా అర్ధం ఏమిటో, ఆ అర్ధానికి ఇష్మాయేలు సరిపోతాడో లేదో ఇప్పుడు మనం చూద్దాం.

ఏకకుమారుడు:
ముస్లింలు ఇక్కడ ఏకకుమారుడు అన్న పదాన్ని దాని భావాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. అబ్రహాముకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇద్దరు కుమారులు ఉండగా బైబిల్ ఇస్సాకు ఏకకుమారుడు అని ఎందుకు భోదిస్తుంది? చూద్దాము.

* ఇస్సాకు దేవుని వాగ్దానం మూలముగా జన్మించాడు. ఇష్మాయేలు దీనికి భిన్నముగా జన్మించాడు.

గలతీయులకు 4: 28
“సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై యున్నాము”.

ఆదికాండము 17: 16
“నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను”.

దీనిని కురాన్ కూడా అంగీకరిస్తుంది.

కురాన్ 11: 72– 73
“ఆమె (శారా) (ఆశ్చర్యంతో) అన్నది: ”నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డపుడుతాడా? నేను ముసలిదానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే!” వారన్నారు: ”అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్త్వపూర్ణుడు”.

కురాన్ 37: 112 – 113
“మరియు మేము అతనికి ఇస్‌’హాఖ్‌ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త. మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్‌ను) మరియు ఇస్‌’హాఖ్‌ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండేవారు మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు”.

కురాన్ 51: 28
“(వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: “భయపడకు!” మరియు వారు అతనికి జ్ఞాన వంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు”.

* ఇస్సాకు అధ్బుతమైన రీతిలో జన్మించాడు ఎలా అనగా “పండు ముసలి దంపతులైన అబ్రహాము, శారా దంపతులకు జన్మించాడు”. ఇష్మాయేలు ఇందుకు భిన్నముగా సహజముగా ఒక దాసికి జన్మించాడు.

ఆదికాండం 18: 9 – 15

ఆదికాండం 21: 1 – 7

దీనిని కురాన్ కూడా అంగీకరిస్తుంది.

కురాన్ 11: 69 – 73

కురాన్ 51: 24 – 30

* అబ్రహాము పొందిన స్థలమును, ఇస్సాకు సంతానముకు వారసత్వపు హక్కుగా ఇస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్ధానం చేసాడు.

ఆదికాండం 13: 14 – 18
“ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను”.

ఆదికాండం 15: 18 – 21
“ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

ఆశ్చర్యకరమైన విషయం యేదనగా కురాన్ లో ఎక్కడా కూడా ఇష్మాయేలు పేరును అనగా “అబ్రహాము ఇష్మాయేలును బలిగా అర్పించదలుచుకున్నాడు” అని ఎక్కడా మనకి కనపడదు లేకపోగా మన షఫీ గారు మాత్రం కచ్చితంగా ఇష్మాయేలే అని గొంతు అరిగిపోయేలా కేకలు పెట్టడం మనం గమనించాము. వారి కురాను లోనే స్పష్టత లేదు గాని ఈయన గారు మన బైబిల్ని మాత్రం తప్పు పడుతూ వుంటాడు. మరి స్పష్టత దేవుని వూపిరిచే వ్రాసిన బైబిల్ నందు వుందా? కురాన్ నందు వుందా? మీరే ఆలోచించుకోవాలి.

ఇంకా ముఖ్యమైన విషయం యేదనగా బైబిల్ , కేవలం బైబిల్ మాత్రమే ఈ లోకములో ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలదు అని గర్వముగా చెబుతున్నా ఎలా అనగా కురాన్ లో ఎక్కడా కూడా దేవుడు అబ్రహామును అసలు ఎందుకు పరిశోధించాడో వివరించలేదు. బైబిల్ దానికి స్పష్టమైన సమాధానం ఇచ్చింది

హిబ్రీయులకు 11: 17 -19:
“అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను”.

రోమీయులకు 4: 3
“లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను”.

యాకోబు 2: 23:
“కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను”.

          కురాన్ చేయలేనిది బైబిల్ చేసి చూపించింది.

పైన విశ్లేషించిన దేవుని వాగ్దానాలను బట్టి “అబ్రహాము బలిగా అర్పించదలుచు కుంది వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునా లేక దాసి కుమారుడైన ఇష్మాయేలునా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.