రక్షణ అనగా ఏమి?

0
325

దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి మనం విమోచిన్చబడుటయే “రక్షణ”.

దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఈ స్ప్రుష్టి అంతటిలో కూడా దేవుడు మాత్రమే ధర్మానికి ప్రామాణికమైన వ్యక్తి. దేవుడు ఈ ప్రామాణిక ధర్మాన్ని తన యొక్క వాక్యమైన బైబిల్ నందు వెల్లడి పరుచుకున్నాడు. నిర్గమకాండం 20 వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు ఇస్రాయేల్ సంతానముకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ పది ఆజ్ఞలలో దేవుడు నైతిక పరిపూర్ణత యొక్క ప్రమాణాలు మనకు వివరించెను. ఈ నైతిక పరిపూర్ణత ప్రమాణాలలో దేవుని యొక్క లక్షణములు స్పష్టముగా తేటపరచబడుచున్నవి.

మత్తయి 12: 34 ప్రకారం:
“హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా”.

కాబట్టి ఇస్రాయేలుకు ఇచ్చిన నైతిక చట్టమును బట్టి దేవుడు యొక్క అంతరద్రుష్టి లక్షణములు కనబడుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం న్యాయబద్ధంగా ప్రామాణికమైనది. వీటిని సమస్త జనులు ఆచరణలో పెట్టుటకు భాద్యత వహించాలి.

పరిహారము లేకుండా చట్టాన్ని ఉల్లంఘించుటకు యే చట్టం కూడా వుండదు. ఒక వేళ ఒక చట్టానికి పరిహారం కనుక లేకపోయినట్లైతే అది చట్టం కానే కాదు కేవలం నినాదం మాత్రమే అవుతుంది.

యెహేజ్కేలు 18: 4 ప్రకారం “పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును”.

రోమీయులకు 7: 7 ప్రకారం “ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో తెలియకపోవును”

కాబట్టి ధర్మశాస్త్రం నందలి ఆజ్ఞలను ఉల్లంఘించిన యెడల వారు మరణం పొందవలసి ఉంది . కాని దేవుడు ఈ మరణము నుండి మనల్ని రక్షించుటకు తన యొక్క స్వంత కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకములోనికి పంపి పాప పరిహారార్ధ బలిగా అర్పించాడు . దీనిని బట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు .

1 పేతురు 2: 24 ప్రకారం:
“మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి”. కాబట్టి రక్షణ కేవలం మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే గాని ఈ లోకములో ఎవరి వలనైనను కాదు.

చివరిగా రక్షణ అనగా ” దేవుని యొక్క న్యాయమైన తీర్పు నుండి తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షించబడుటయే .