అబద్ద ప్రవక్తలు – అవగాహన!!

0
342

“వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు” మత్తయి 7 :16

యేసు క్రీస్తు తన పరిచర్య సమయంలో చెప్పిన ఎన్నో ఉపదేశాలు ప్రజల జీవితాన్ని మార్చి వారి ఆత్మీయ జీవిత ఆశలకు క్రొత్త రూపం ఇచ్చాయి. అలాంటి మాటలలో యేసు చేసిన “కొండ మీది ప్రసంగం” చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రసంగం ఎలాంటి వారినైనా అబ్బుర పరచేదిగా ప్రభావితం చేసేదిగా ఉంటుంది అన్నది వాస్తవం. నాటి యూదుల మొదలు నేటి గాంధి వంటి వారి వరకు ఈ ప్రసంగం అందరిని ఆకట్టుకోవడం, అందరికి సదుపదేశం ఇవ్వడం కొత్త ఏమీ కాదు. ఈ ప్రసంగం లో యేసు క్రీస్తు వారు తన మనసును ప్రజలవద్ద పరచడం ఒక ఎత్తు అయితే ఆ ప్రసంగాంత్యంలో అబద్ద ప్రవక్తల గురించి చెప్పడం చాలా పెచ్చుగా గమనించవలసిన మర్మం. యేసు మాటలు చాలా మంది యూదులకు స్వేచ్చా రాశి ధోరణిలో ఉన్నప్పటికీ ఆ మాటలు వారి మనసును కుదిపేశాయి. ఆయన సిద్ధాంతాలు వారికి తేట తెల్లగా అర్థం అయి వారి జీవితాలు మారిపోయాయి. ఇప్పటికీ మారిపోతూనే ఉన్నాయి. అంతే తెగువతో అబద్ద ప్రవక్తలను తూర్పారబట్టేందుకు ఒక కొలమానంగా కూడా మిగిలాయి.

ఆయన అబద్ద ప్రవక్తలను గురించి జాగ్రత పడమని చెబుతూ

“వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్ల నైనను కోయుదురా? ….. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలుసుకొందురు

అని చెప్పడం జరిగింది. ఇక్కడ అబద్ద ప్రవక్తలను గొర్రెల చర్మంలో ఉన్న క్రూరమైన తోడేళ్ళుగా వర్ణించడం జరిగింది. వారిని ముండ్ల పొదలతో, పల్లేరు చెట్లతో పోల్చడం జరిగింది. యేసు ప్రభువు వారు ఏ ఒక్క పదాన్ని యాదృచ్చికంగా వాడలేదు అన్నది నా అభిప్రాయం. ఆయన అక్కడ “క్రూరం” “ముండ్లు” వంటి పదాలను వాడారు అంటే ఆయన చెప్పే అబద్ద ప్రవక్తలు బయటికి క్రూరంగా కనిపించక పోయినా వారి సిద్ధాంతం, ప్రవర్తన, ప్రభావం లో క్రూరత్వం, ముండ్ల వంటి సౌఖ్య రహితమైన భావనలు ఉన్నట్టు మనము గమనించవచ్చు. బయటికి అంతా బాగా కనిపించినా అసహ్యకరమైన అలవాట్లు, హేయమైన సిద్ధాంతాలు, క్రూరమైన ప్రతిఘాతుకమైన క్రియలు మరియు ప్రతిక్రియలు వారి సంకల్పాలలో కనిపిస్తుంటాయి. కాకపోతే గమనించవలసిన విషయం ఏమిటంటే వారిని యేసు “అబద్ద ప్రవక్తలు” అని ఉచ్చరించడం. అంటే వారూ ప్రవచిస్తారు, ప్రభావవంతంగా వ్యాపిస్తారు, జనులపై ప్రవక్తలకున్న పట్టు వారికీ ఉంటుంది. అంటే వారూ దేవుని ప్రవక్తల లాగానే ప్రజలను నమ్మిస్తారు. కాక పోతే “అబద్దాలతో”. సత్యానికి దగ్గరగా కనిపించి మభ్యపెట్టే అసత్యాలతో వారు క్రూరత్వంలోకి మందిని తోలుకు పోయే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి గురించే యేసు నిక్కచ్చిగా నిర్మొహమాటంగా పలకడం ఆయన మాటలను గ్రహించి వాటి ఆధారంగా బ్రతకాలనుకొనే ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక మేలుకొలుపు. చాలామంది అబద్ద ప్రవక్తలు ఉన్నందువలన వారి ఫలములను చూసి వారిని గ్రహించేందుకు వారి గురించి మీ ముందుంచే ప్రయత్నం ఈ శీర్షిక ద్వారా చేస్తాను.

యేసును అనుసరించే క్రైస్తవులకు వారి ఫలముల యొక్క కొలమానం గలతీయులకు వ్రాసిన పత్రిక 5:22 లో ఇవ్వబడింది.

గలతియులకు 5:22:
“అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.”

ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము మొదలైనవి ఆత్మ ద్వారా హృదయం లో సున్నతి పొందిన వారిలో కనిపించే గుణాలు. అలాగే శరీర సంబంధమైన మెరుగులు చూపించే వారిలో ఉండే గుణాలనూ చెప్పడం జరిగింది అవి

– జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, బేధం, విమతం, అసూయ, మత్తత, అల్లరి మొదలగునవి. మొదటి రకం గుణములు లేని చోట రెండవ రకం గుణాలు తప్పకుండా ఉంటాయి. నేను చెప్ప బోయే ప్రవక్తల విషయంలో ఆయన ప్రకటించిన తత్వం విషయంలో ఈ మాట నిజం అవ్వడం మీరు చూస్తారు.

శరీర సంబంధమైన గుణాలను నాలుగు భాగాలుగా విడదీయ వచ్చు 1 . శరీరము ననుసరించి ఉండే పాపగుణం (జారత్వం – కాముకత్వం) 2 . దేవునికి వ్యతిరేకంగా ఉండే పాపగుణం (విగ్రహారాధన – అభిచారం) 3 . మనుసులో కలిగే పాపగుణం (ద్వేషం – అసూయ) 4 . సమాజానికి వ్యతిరేకంగా ఉండే పాపగుణం ( మత్తత – అల్లరి)

నేను ప్రస్తావించే (అబద్ద) ప్రవక్తలు, మరియు వారి ఉపదేశాలు, పై నాలుగు భాగాలకు సంపూర్ణంగా మద్దతు పలకటం చూడవచ్చు.

ఆ ప్రవక్తలు (అబద్ద ప్రవక్తలు), కామానికి ప్రతిరూపం అని చెప్పాలి. వారికి తొమ్మిదేళ్ళ బాలిక నుండి ముసలి వయసులో ఉన్న ఆడవాళ్ళ వరకు అందరిని భార్యలుగానో, ఉంపుడు గత్తేలుగానో లేక సేవకురాండ్లగానో వారితో సుఖం అనువభవిస్తారు. ఇందులో ఇంకొ మెలిక ఏమిటంటే అలా చేయమని తనకు దేవుడే ఆజ్ఞాపించినట్టు చెప్పుకుంటారు. అలాగే తనను అనుసరించిన వారితో తమ సేవకురాండ్లను, బానిసలను వారి భర్తల సమక్షంలోనే అనుభవించమని కూడా ఆజ్ఞాపిస్తారు. ఇది కూడా చాలదని తన అనుచరులకు స్వర్గ లోకంలో దేవుడు వారి కోర్కెలు తీర్చేలా కన్యకలను ప్రసాదిస్తాడు అని కూడా బోధిస్తారు.

ఆ ప్రవక్తలు (అబద్ద ప్రవక్తలు), తన జీవిత కాలంలో విగ్రహారాధన చేయకూడదు అని చెపుతూనే పరాయి దేవతలను కూడా పొగడటం, వారికి ప్రణామం చేయడం, మరియు సాతానుచే మాటలు పలుకుతారు. అలాగే అన్య మతముల వారు చేసిన విధంగ విగ్రహములు లేక ఒక వస్తువు లేక ఒక ప్రదేశము చుట్టూ తన అనుచరులు ప్రదక్షిణాలు చేయాలి అని కూడా ఆజ్ఞాపించి దేవునికి హేయమైన పనిని తన అనుచరులతో చేయిస్తు ఉంటారు.

మనసులో కలిగే నీచమైన ఆలోచనలకూ దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఆ ఆలోచనలను దేవుడిచ్చిన వాక్యాలుగా( ప్రత్యక్షతలుగా) వర్ణించటం ఈ (అబద్ద) ప్రవక్తలకు వెన్నతో పెట్టిన విద్య. కక్ష సాదించాలి, దండెత్తి సొమ్ము దోచుకోవాలి, పెంచుకున్న పాపానికి కొడుకైనా సరే వాడి నుండి తనకు కావలిసింది గుంజుకోవాలి, దేవుని పేరుతో అబద్దం అయినా సరే చెప్పాలి, మున్నగు ఘోరమైన క్రూరమైన ఆలోచనలు కార్యములు చేయటం మరియు చేయించటం ఇలాంటి అబద్ద ప్రవక్తలకు వారి దేవుడైన సాతాను ఇచ్చిన వరం.

ఇక సమాజంలో అల్లరి సృష్టించాలన్నా, శాంతి సామరస్యాలు చిన్నా భిన్నం చెయ్యాలన్నా ఇలాంటి అబద్ద ప్రవక్తలకు వారి అనుచరులకు సాటి ఇంకెవ్వరూ లేరు అన్నది చరిత్ర చెప్పే నగ్న సత్యం.

పైన చెప్పిన ప్రతి ఒక్క మాటకు ఆధారం ఈ, (అబద్ద) ప్రవక్తలకు తన దేవుని (సాతాను) నుండి పొందిన పుస్తకం అవుతుంది. చదివే చాలా మందిలో ఇప్పటికే ఆ(అబద్ద) ప్రవక్త ఎవరూ అన్న విషయం అర్థం అయి ఉంటుంది. ఒక వేళ అర్థం కాకపోతే మీరు ఈ వ్యాసం తప్పక చదవాలి.

ఎందుకంటే ఇలాంటి వారు స్థాపించిన దేవుని రాజ్యం, విశ్వాసుల సమూహం అత్యంత శాంతికరమైనది మరియు శాంతిని ఇలలో నెలకొల్పేదిగా ప్రకటించబడుతూ ఉంటుంది. యేసు చెప్పిన మేక వన్నె పులి ఇలాంటి వారు కాదేమో నాకు చెప్పండి!

అవాక్కయ్యారా?? కాస్త ధైర్యం తెచ్చుకోండి. రానున్న రోజుల్లో ఈ అబద్ద ప్రవక్తల మతం మీపై, మీ కుటుంబాలపై, మీ సంఘాలపై, మీ మనసులపై, మీ దుస్తులపై చలామణీ చెయ్యబోతోంది. మీరేం తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా తాగాలి, ఎవరిని చంపాలి, ఎవరిని బతికించాలి, ఎవరిని ద్వేషించాలి, ఎవరిని మానభంగం చేయాలి అనే అన్ని కోణాలలో మీపై పెత్తనం చలాయించబోతోంది!! వినటానికి మీకు, చెప్పటానికి నాకు, చాలా సంతోషంగా ఉంది కదా?? అదే అంత్యక్రీస్తు అనే మతం. మొదట ఆ మతం, శాంతియుతమైన మతం, ప్రియమైన ప్రవక్తగా కనిపిస్తాయి. యేసు చెప్పిన ఫలముల కొలమానంలో చూస్తే ఇలాంటి మతం కానీ దాని సిద్ధాంతం కానీ, ఆ సిద్ధాంత కర్త అయిన అబద్ద ప్రవక్త కానీ ఎన్నటికి నిజమైన ప్రవక్త, సత్యాన్ని అనుసరించే సమాజంగా ఎవ్వరూ ఒప్పోకోలేరు.

ఈ మత ప్రచారకులు చాలా సార్లు, “చూడండి మా మతంలో మత్తు పానీయం త్రాగము, వ్యభిచారం చెయ్యము, దేవుని ధర్మశాస్త్రాన్నే ఆధారం చేసుకొని న్యాయ నిర్ణయం చేస్తాము” అని పెద్ద పెద్ద మాటలు బొంకుతూ ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించి, గడ్డాలు పెంచి, గుడ్డిగా తమ ప్రవక్త చెప్పిన మాటలను పాటిస్తూ ఇతరులకు ఏమైనా సరే తమకు మాత్రం అన్నీ సౌకర్యంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అందుకే యేసు వీళ్ళను “గొర్రెల చర్మంలో ఉండే తోడేళ్ళు” అని వర్ణించారు.

1. శరీరము ననుసరించి ఉండే పాపగుణం (జారత్వం – కాముకత్వం):
శరీరవాంఛలలో అతి మూలమైన వాంఛలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఆకలి, నిద్ర, రతి మొదలగునవి. ఈ అన్ని వాంచలు కూడా దేవుడు మనలను సృష్టించినప్పటి నుండి మనకు ఇచ్చాడు ఎందుకంటే అవి మన మనుగడకు అవసరం కనుక. మనం భోంచెయ్యాలి, విశ్రాంతి తీసుకోవాలి అలాగే సంయోగం కూడా జరపాలి, ఇది ప్రాకృతికమే. కాకపోతే దేవుడు పెట్టిన ఎల్లలు దాటి ఈ వాంఛలు తృప్తి పరచటం పాపం. ఉదాహరణకు భోజనం బ్రతకటానికే కానీ భోజనం కొరకే బ్రతకకూడదు అందుకే బైబిలు తిండిపోతుతనాన్ని పాపంగా వర్ణిస్తుంది

సామెతలు 23:2
“నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.”

అలాగే అతిగా నిద్రించే వాళ్ళని సోమరి పోతులుగా యెహోవాకు నచ్చని ప్రజలుగా లేక పాపులుగా బైబిల్ చెపుతుంది. ఇదే కోవకు చెందిన మూలవాంఛ అయిన సంయోగం లేక రతి కూడా వివాహం అనే హద్దుల్లో జరిగినంత వరకు దేవునికి సమ్మతమే కానీ హద్దులు మీరి వివాహం పేరుతో ఎవ్వరు పడితే వారితో సంయోగం/రతి జరపడాన్ని బైబిల్ వ్యభిచారం అని అంటుంది. ఈ పాపం దేవునికి విరుద్ధంగానేగాక శరీరానికి కూడా విరోధమైనది 1 కొరింథీ 6:18. తార్కికంగా చూస్తే పాపానికి మతం లేదు, అది అందరికంటే ఎక్కువ మతసామరస్యం కలిగిన అస్తిత్వం లేని ఒక విషయం.

1కోరింథీయులకు 6:18:
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.”

కనుక ఈ ప్రవృత్తి క్రైస్తవులలో, ముస్లిములలో, హిందువులలో మరియు ఏ మతానికి చెందిన వారిలో అయినా సరే ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే మనుష్యజాతికి మాదిరికరంగా తమను తాము చాటుకునే మహానుభావులలో మాత్రం ఇలాంటి పాప గుణం కనిపిస్తే అది సామాన్య ప్రజలకు మింగుడు పడదు. పాపగుణం కనిపించటం అంటే దానిని పాటించడం అని నా అర్థం.

యేసు క్రీస్తు వారు చెప్పిన అబద్ద ప్రవక్తలు ఈ పాపం తప్పక చేస్తారు. పవిత్రతను కోల్పోయినప్పటికి ఆ పాపాన్ని కప్పుకొనేందుకు తమకు అనుకూలమైన మేక చర్మం లాంటి పద్ధతులను ప్రతిపాదించి సమాజంలో పరువు కాపాడుకోవడానికి కూడా వెనుకాడరు ఈ మేక వన్నె పులులు. మరి ఎంతోమంది ప్రజలు అనుసరించే అబద్ద ప్రవక్తలు ఇలా చేస్తారు అంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు ఎందుకంటే వారి శరీర వాంచలను తీర్చుకొమ్మని వారి దేవుడే ఆజ్ఞాపించాడు మరి. తనకో న్యాయం పక్కోడికో న్యాయం అన్నట్టు భార్యలను పొందే సంఖ్యలో తనను అనుసరించే వారికి విధించిన నియమమును కూడా ఉల్లంఘించి తనకు నచ్చినంత మంది భార్యలను, ఉంపుడు గత్తెలను తెచ్చుకున్న ఘనత ఇలాంటి అంత్య క్రీస్తుకే దక్కుతుంది. ఇందులోనూ వావి వరుసలు లేకుండా కుమారుని భార్యను, బాలికలను, స్త్రీ ప్రకృతిని కోల్పోయిన వృద్ధురాళ్ళను కూడా వీరు విడిచిపెట్టరు.

అలాగే ఈ ప్రవక్తలు తమ అనుచరులకు వారి దాసీలపై హక్కు ఇవ్వడం, యుద్ధంలో వారిని గెలుచుకున్న తరువాత వారి భర్తల సమక్షంలోనే వారితో రతి జరపమనటం వంటి భిన్నఅసాంఘిక అలవాట్లను కూడా నేర్పారు. అలాగే యుద్ధం సమయంలో ఒక నూలుగుడ్డ ఇచ్చి అయినా సరే కొద్ది సేపటికి స్త్రీలను పెండ్లాడి వారిని అనుభవించి తరువాత విడాకులు ఇవ్వవచ్చు అని అనుచరులకు చెప్పే వారూ లేక పోలేదు. కాక పోతే సభ్య సమాజం దానికి వ్యభిచారం అని పేరు పెట్టింది.

ఇది చాలక వారి మతాన్ని అనుసరించి చచ్చిపోతే స్వర్గలోకంలో వెడల్పైన చనులు, పెద్ద కన్నులు గల అందమైన కన్యకలను వారి దేవుడు ప్రసాదిస్తాడు అని, రోజుకు 70 మంది కన్యకలను అనుభవించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా ఇలాంటి ప్రవక్తలు చెబుతారు. ఇది వారు అబద్ద ప్రవక్త లేక క్రీస్తువిరోధి అని చెప్పటానికి మొదటి నిదర్శనం.

2. దేవునికి వ్యతిరేకంగా ఉండే పాపగుణం (విగ్రహారాధన – అభిచారం)
పైకి ఏక దేవుని ఆరాధించే మతంగా ఉన్నప్పటికి సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి మతం నిజానికి ఆ సిద్ధాంతాన్ని పాటించదు అని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు దేవునితో పాటే ప్రవక్త నామమును కూడా స్మరించమంటారు ఈ క్రీస్తు విరోధులు. బైబిల్ ప్రతిపాదించే సిద్ధాంతం దేవుని స్మరించమనేంత వరకే ఆగిపోతుంది. కాకపోతే ఈ అబద్ద ప్రవక్తలు మాత్రం క్రైస్తవులకు అంగీకార యోగ్యం కాని వారి వారి నామములను కూడా జపించమంటారు. దీనిని బైబిల్ అంగీకరించదు ఎందుకంటే ముందు వచ్చిన ఏ ఒక్క ప్రవక్త (ఏక దేవుని ఆరాధించమని చెప్పిన) కూడా తన ఉనికిని దేవునితో సమానంగా చాటలేదు. మోషే నుంచి యేసు వరకు మరియు యేసు నామంలో నేటి ప్రతి క్రైస్తవుని వరకు ఎవరు కూడా తమ పేర్లను “షెమా” (దేవుడు ఒక్కడే) అనే సిద్ధాంతంతో జతపరచలేదు. ఎందుకంటే యోహాను అన్నట్టు “నేను తగ్గింపబడాలి ఆయన (దేవుడు) హెచ్చింపబడాలి” అనే మూలసిద్ధాంతం “షెమా” సిద్ధాంతానికి ప్రమాణము కనుక.

ఇందుకు విరుద్ధంగా క్రీస్తు విరోధులు తనను ప్రవక్త అని చెబుతూనే ముఖ్యమైన ఆధారభూతమైన సిద్ధాంతానికి తన ఉనికిని జతపరిచి ఒక రకమైన విగ్రహారాధనను మొదలుపెడతారు. నిజానికి వినడానికి చూడటానికి దేవుడొక్కడే అనే సిద్ధాంతము కనిపింస్తుంది కానీ ఇలాంటి మతంలో ప్రవక్త పై ఉన్న భక్తి గౌరవాలు స్వయంగా దేవునిపై లేకపోయినా పరవాలేదు. ఇలాంటి మతములో దేవుని దూషిస్తే శిక్ష ఉండదు కానీ ప్రవక్తను దూషిస్తే మరణ దండన తప్పదు. దీనికి అర్థం ఏమిటి?? అలాగే స్వయానా ప్రవక్త కూడా విగ్రహారాధన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉంది.

రాళ్ళను ఆధ్యాత్మిక యాత్ర సమయంలో ముద్దుపెట్టుకొనే ఆచారం అన్యులలో ఉన్నట్టు ఈ ప్రవక్తలు కూడా చేస్తారు మరియు చెయ్యమని ఆజ్ఞాపిస్తారు. అలాంటి ఆచారాన్ని ప్రవక్తలు ఆపి వేయాల్సింది పోయి తను కూడా పాటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. అంతేకాదు అతి ప్రాముఖ్యంగా పరాయి దేవతల ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు అని చెబుతూ ఆ మాటలను దేవుని వాక్యముగా ప్రకటించి ప్రజలను మభ్యపెట్టటం జరుగుతుంది. అలాగే అభిచారమైన కనికట్టు విద్యలు కూడా దేవునికి హేయమైనవె. దేవుని నిజమైన ప్రవక్తలు వాటికిలొంగరు. కానీ, ఇలాంటి ప్రవక్తలు చిల్లంగి మరియు కనికట్టు ప్రభావం లో బాధ పడి ఆత్మ హత్యా యత్నము కూడా చేస్తారు. ఇది అబద్ద ప్రవక్త ప్రకటించిన అసలు క్రీస్తువిరోది మతం.

3 . మనసులో కలిగే పాపగుణం (ద్వేషం – అసూయ).
ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, బేధం, విమతం, అసూయ మొదలగు మనసులో కలిగే దుర్గుణాలను గురించి గలతీ 5 :22 ను గురించి ధ్యానించే సమయంలో పైన చెప్పుకున్నాం. పైన చూపిన అన్ని గుణాలు అబద్ద ప్రవక్తలలోనూ తన అనుచరులలోనూ చూడవచ్చు. ఆత్మ నిగ్రహం కలిగి శత్రువులను సహితం ప్రేమించాలని చెప్పిన బైబిలులో చెప్పబడిన ప్రవక్తలకు, అబద్ద ప్రవక్తలకు పొంతన ఉండదు. ఎందుకంటే వారు తనను విమర్శించిన పాపానికి వారి పొరుగువారిని ముసలి ముతక అని తేడా లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపమని తన అనుచరులకు ఆజ్ఞాపిస్తారు. అలాగే ఆ అనుచరులు మత చాందస వాదం లో ప్రవక్త ను విమర్శించిన పాపానికి ముసలి వారిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపటం జరుగుతుంది. అలాగే ఈ ప్రవక్తలను చులకనగా మాట్లాడిన పాపానికి పిల్లలు గల తల్లిని రాత్రికి రాత్రి చంపమని ఆజ్ఞాపించిన, ద్వేషంతో కూడిన ఘనత ఈ దుర్మతానికి మరియు తన అనుచరులకే దక్కాలి. ఇలాంటివి చేస్తూ వారు దేవునికి ఏదో సహాయం చేస్తున్నాం అని అనుకుని అలా చేసే వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మరీ తన ద్వేషాన్ని, క్రోధాన్ని చాటుకుంటారు . కక్ష సాధింపు చర్యలు అది కూడా దేవుని పేరట చేయడం క్రీస్తు విరోధ మతానికి ఇలాంటి ప్రవక్త కు వాళ్ళ దేవుడిచ్చిన వరం.

ఈ మతం వారు ఆ మతంలో లేని వారితో అబద్ధం ఆడవచ్చని, వారిని అణిచివేయటానికి పన్నులు విధించవచ్చని, సహకార నిరాకరణ, సాంఘీక ఒత్తిడి కలుగ చేసి వారిని క్రీస్తు విరోధి మతంలోనికి లొంగిపోయేలా చేయవచ్చని కూడా ఇలాంటి ప్రవక్తలు నేర్పిస్తారు . క్రీస్తు విరోధ మత స్థాపనలు మొదలుకొని, ఆ ప్రవక్తలు చనిపోయి, వారి పెద్దలు తమ ఆధిపత్యం చేపట్టటానికి, రాజ్యాలను గెలవటానికి, విధ్వంసం సృష్టించటానికి, నేటి ఉగ్రవాదం వరకు ఇలాంటి మతాలు కలహాన్ని, కత్తినే ఉపయోగించాయి అని చెప్పటానికి మన ఎదురుగా ఉన్నఅనుదిన సమాచారం సరిపోదా? అబద్ద ప్రవక్తలు తన అనుచరులతో కలిసి వర్తక యాత్రీకులను దారిలో ముట్టడించి చంపి దోచుకున్న సొమ్ముతో తన మత స్థాపన చేస్తారు. ఇది తప్పు అనే దమ్ము ధైర్యం ఏ మనిషికి కూడా లేదు ఎందుకంటే వారి మత గ్రంధాలన్నీ ఈ విషయాన్ని నొక్కి ఒక్కానిస్థాయి. ఒకరి సొమ్ము ఆశించే ఈ గుణం దేవుని దృష్టిలో పాపమేనని ఇలాంటి ప్రవక్తలకు తెలియదా?

4 . సమాజానికి వ్యతిరేకంగా ఉండే పాపగుణం ( మత్తత – అల్లరి):
పైన చెప్పిన సన్నివేశాలన్నీ కూడా అల్లరిని సృష్టించేవే. అయినా అబద్ద ప్రవక్తలు ప్రత్యేకంగా అల్లరికోసం కూడా తన శిష్యులను ప్రేరేపిస్తారు. మత్తత అంటే తాగిన మత్తు పదార్ధం వలన ప్రభావితం చేయబడటం. పౌలు ఎఫేస్సీయులకు వ్రాసిన పత్రిక 5 :18 లో మధ్యముతో మత్తులయి ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని వ్రాసాడు. అనగా మత్తులయి ఉండటం వలన కలిగే నష్టం దుర్వ్యాపారం, అంటే దుష్క్రియలు. గ్రీకులో వాడబడిన పదానికి జంతుసమానమైన ప్రవృత్తి అని, హద్దులు లేని ప్రవృత్తి అని కూడా అర్థం వస్తుంది. అంటే మద్యం వలన మనిషి దాని వశుడై తన హద్దులు మరిచి జంతువులా, దుష్కార్యములు చేసే అవకాశం ఉంది అని అర్థం. కానీ ఆత్మ పూర్ణులై ఉండటం అంటే ఆత్మ చే ప్రభావితులై, నింపబడి, దైవ ప్రభావం లో నడుచుకొండి అని అర్థం. ఇక్కడ క్రీస్తు విరోధి మతము లో మద్యం తాగవద్దు అని చెపుతూనే దానికంటే విషపూరితమైన మతం అనే మత్తులో తన అనుచరులను ముంచేసాడు అబద్ద ప్రవక్త. అందుకే వారు జంతు సమానంగా అల్లర్లు, హత్యలు, మానభంగాలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడో ఎవడో ఎప్పుడో ప్రవక్తను ఏదో అన్నాడు అని ఇంకెక్కడో ఇంకెప్పుడో ఆ మత చాందస వాదులు తమ మతములో లేని వారిని కాల్చి చంపుతారు, మాన భంగాలు చేస్తారు. ఈ మత్తత మద్యంలో ఉండే మత్తత కంటే మిన్న కాదా?

ఇవి అబద్ద ప్రవక్తల మతాలు కొన్ని వేల సంవత్సరాలుగా కోస్తున్న ఫలం. ఇలాంటి మత ప్రచారకులు “చూడండి యేసు ఫలములను చూసి వారి మార్గం సరి అయినదో లేక కాదో నిర్ణయించుకోమన్నాడు “ అని కేకలు వేస్తూ ఉంటారు. కాక పోతే కొద్దో గొప్పో సహజ జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరూ కూడా ఇలాంటి మతాల యొక్క ఫలాలను చూడకుండా ఉండలేరు. భార్యలను ఆస్తులుగా పరిగణించి వాడుకోవడానికి పిల్లలను కనడానికి ఉపయోగించుకొనే యంత్రాలుగా చూడమని చెప్పే మతాల ఫలం మనకు తెలియనిదా? అవసరమైతే భార్యలను కొట్టవచ్చు అని చెప్పే మతము యొక్క ఫలం చెడినది కాదా? మనిషికి ఉన్న స్వతంత్ర ఆలోచనా శక్తిని క్షీణింపజేసి వారి మేధస్సును కేవలం మతం కోసం వాడుకునే ఇలాంటి అసాంఘిక మతాలు ఫలించిన ఫలాలు ఒక్కటీ మంచిగా కన పడదు ? మతం పేరుతో ఊచకోత కోసే ఫలం ఎవరికి కావాలి?

“వారి ఫలములవలన మీరు వారిని తెలుసికొందురు” మత్తయి 7 :16 …

“ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” ఇది క్రైస్తవ ఫలము.