కురాన్ ప్రామాణిక గ్రంథమా!!

0
298

ఇస్లాం మతములో అతిపెద్ద అబద్ద ప్రచారము ఏమిటంటే కురాన్ లేఖనములు ఏ మాత్రం వికృతిలేని మరియు జాగ్రతగా సంరక్షింపబడినవి అన్న వదంతు. ఎన్నో శతాబ్దాలుగా బైబిలు గ్రంధములోని లేఖనములు మానవునిచే వక్రీకరించబడ్డాయని అలా కాకుండా కురాన్ మాత్రం ఎంతో జాగ్రతగా మానవుని వక్రీకరణకులోను కాకుండా సంరక్షింపబడిందని ముస్లిములు చాటుతూ వచ్చారు. అయితే ఈ విషయాన్ని లోతుగా పరీక్షించి చూస్తే తేలే పరిణామాలు భిన్నంగా ఉంటాయి. దీనికిగాను కురాన్ ను పొందుపరచటంలో చరిత్రలో చోటు చేసుకొన్న వాస్తవాలను పరీక్షించి చూడాలి. ఆవిధముగా పరీక్షించి చూస్తే రుజువులు కురాన్ సంరక్షింపబడినది అని చెప్పటానికంటే పొందుపరచబడే ప్రక్రియలో అది ఎంతో వికృతి/ వక్రీకరణకు లోనైందని తేల్చి చెప్పటానికి తోడ్పడతాయి. క్రింది అధ్యయనము యొక్క జ్యేష్ట భాగము సూటిగా ఇస్లాం మత ప్రముఖ గ్రంధముల నుండే తీసుకోబడినవి. అన్నిటికంటే ముందు గమనించవలసినది ఏమిటంటే మొహమ్మద్ జీవితకాలంలోనే కురాన్ యొక్క సంపూర్ణ గ్రంధము అందుబాటులో ఉండెడిది అన్న వదంతు. ఈ వదంతుకు ఎటువంటి ఆధారాలు లేవు ఎందుకనగా. మొట్టమొదట సంపూర్ణ కురాన్ గ్రంధము యొక్క కూర్పు “అబూ బకర్” అనే కలిఫా హయాములో మొహమ్మద్ మరణానంతరం జరిగింది.

“జైద్ బిన్ తాబిత్ అల్ అన్సారి” యొక్క వ్యాఖ్యానం:
యమ్మా యుద్ధములో జరిగిన ప్రాణ నష్టము (చాలామంది కుర్రా చనిపోయిరి) జరిగిన తరువాత దైవ ప్రకటనను వ్రాసే వారిలో ఒకరైన అబూ బకర్ నా వద్దకు, వచ్చెను. అబూ బకర్ తో ఉన్న ఉమర్ ఈ విదముగా చెప్పెను: “ఉమర్ నా (జైద్ బిన్ తాబిత్ అల్ అన్సారి) వద్దకు వచ్చి యమ్మ యుద్ధములో మన వారు చాలా మంది మృతి చెందిరి, కుర్రా (కురాన్ ను కటస్థం చేసిన వారు) సమూహములో వారు కూడా చాలా మంది ఇతర యుద్ధములలో మరణించి ఉంటారని నా అనుమానము. దీని మూలముగా, నీవు సమకూర్చకపోతే, కురాన్ లోని ఎక్కువభాగము సమసిపోయే అవకాశం ఉన్నది. నా ఉద్దేశ్యము ప్రకారము నీవు కురాన్ ను సమకూర్చవలెను. అందుకు అబూ బకర్ కల్పించుకొని “అల్లాః ప్రవక్త అయిన మొహ్హమ్మదే చెయ్యని పని నేనెలా చేయుదును” అని అనెను. అందుకు ఉమర్ “అల్లాః సాక్షి గా అది ఎంతో ఉత్తమమైన పని” అని అనెను. అలా ఉమర్ నన్ను తన ప్రతిపాదనను అంగీకరించమని, అల్లాః నా మనసు ఆ పనికై తెరిచేంత వరకు, బలవంత పెట్ట సాగెను. తరువాత నాకు సైతం ఆ పని చేయవలెనన్న ఉద్దేశ్యము కలిగెను. (జైద్ బిన్ తాబిత్ కల్పించుకొని:) ఉమర్, అబూ బకర్ తో కలిసి కూర్చుని నాతో మాట్లాడకుండా ఉండెను. “నీవు ఒక జ్ఞానము కలిగిన యువకుడివి కనుక మేము నిన్ను అనుమానించము (అబద్దములు చెప్పుటయందు మరియు మతిమరుపు విషయమై) మరియు అల్లాః ప్రవక్తకు ఇవ్వబడిన దైవ ప్రకటనలు/ప్రవచనములు నీవే నమోదు చేసేడివాడివి. కనుక కురాన్ ను వెదికి నీవే ఒక ప్రతిలో సమకూర్చవలెను. అల్లాః సాక్షిగా అతను (అబూ బకర్) నన్ను కొండ కదుపమని ఆజ్ఞాపించినా అది నాకు కురాన్ ను పొందుపరచుటకంటే కష్టమైన పని అయివుండేది కాదు. నేను వారిద్దరితో “అల్లాః ప్రవక్త చెయ్యని పనిని చెయ్యుటకు మీకెంత ధైర్యము?” అని అంటిని. అందుకు అబూ బకర్ “అల్లాః సాక్షిగా ఇది ఎంతో ఉత్తమమైన పని” అనెను. నేను, అల్లాహు – అబూ బకర్ మరియు ఉమర్ ల మనసు తెరిచిన విధముగా నా మనసు విప్పెంత వరకు వాదించుచునే ఉంటిని. అప్పటినుండి నేను కురాన్ ను వెదికి, చర్మ పత్రములు, ఎముక పలకలు, ఖర్జూర ఆకుల కట్టల పై వ్రాయబడిన కురాను మరియు కంటత చేసిన వారి నుండి సంపాదించి పొందు పరచితిని. నేను ఖుజైమా వద్ద ఎవరివద్దా లేని రెండు సూరత్ అత్ తావుబలోని వచనములను కనుగొంటిని. అవి (సురా 9 : 128 చేవ్రాతతో సమకూర్చిన కురాన్ అబూబకర్ ను అల్లాః కొనిపోయేంత వరకు అతని వద్దనే ఉండెను, తరువాత ఉమర్ వద్ద అతనిని అల్లాః కొనిపోయేంత వరకు ఉండెను తరువాత ఆఖరుగా ఉమర్ కుమార్తె అయిన హఫ్సా వద్ద ఉండిపోయెను. ( సాహి అల్ బుఖారి వాల్యూం 6 గ్రంధము 60 సంఖ్య 201)

యమ్మా యుద్ధములో చనిపోయిన వారి సంఖ్య 450 :
వేరొక మూలము ఆధారముగా చనిపోయిన వారి వద్ద ఇంకెవరు కంటస్థం చెయ్యని కొన్ని కురాన్ భాగములు ఉండేవి. జుహ్రి నమోదు చేసిన ప్రకారము ” ఎన్నో కురాన్ భాగములు ప్రకటింపబడినవి కానీ యమ్మ యుద్ధములో చనిపోయిన వారు వాటిని కంటస్థము చేసిరి. ఆ భాగములు ఎక్కడా వ్రాయబడలేనందువలన ఆ భాగములు అబూ బకర్ కు కానీ, ఉమర్ కు కానీ, ఉత్మన్ కు కానీ వ్రాయుటకు తెలియలేదు. (జాన్ బుర్టన్ , కలెక్షన్ ఆఫ్ కురాన్ PP 126 -127)

పై లేఖనముల ప్రకారము మనము గమనించ దగ్గ విషయం ఏమిటంటే:

1 : మొహమ్మద్ జీవిత కాలంలో కురాన్ కూర్చబడలేదు.
2 : కురాన్ ను కంటత చేసిన వారిలో చాలా మంది యుద్ధములలో చంపబడ్డారు.
3 : జైద్ బిన్ తాబిత్ కురాన్ ను చర్మ పత్రములు, ఎముక పలకలు, ఖర్జూర ఆకుల కట్టల పై మరియు కంటత చేసిన వారి నుండి సంపాదించి సమకూర్చెను.

ఇంకో గమనించ వలసిన విషయం ఏమిటంటే జైద్ మాత్రమే కురాన్ ను సమకూర్చే పనిని చేయలేదు. ఉబయి బిన్ కాబ్ మరియు అబ్డుల్లః ఇబ్న్ మసూద్ వంటి వేరిరువురు కూడా వారికి తోచినట్టు కురాన్ ను జత కూర్చారు. ఇంకా చెప్పాలంటే “ఉబయి బిన్ కాబ్” మరియు “అబ్డుల్లః ఇబ్న్ మసూద్” లను మొహమ్మదే కురాన్ ను కంటత చేసిన వారిలో అతి శ్రేష్టులుగా పరిగణించాడు.

మస్రూక్ నమోదు చేసిన విషయం:
మేము అబ్డుల్లః బిన్ అమర్ వద్దకు మాటలాడుటకు వెళ్ళుచుంటిమి. ఇబ్న్ నుమైర్ చెప్పెను : ఒక రోజు మేము అబ్డుల్లః బిన్ మసూద్ గురించి మాటలాడగా, నీవు నేను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి గురించి మాటలాడితివి.నేను అల్లాః ప్రవక్త ” నలుగురి వద్ద నుండి కురాన్ నేర్చుకోండి, వారు – అబ్డుల్లః బిన్ మసూద్ ( ఆయన పేరు తో మొదలు పెట్టెను ) తరువాత మవుదః బిన్ జబల్ తరువాత ఉబయి బిన్ కాబ్ అటు తరువాత అలీ హుడైఫా యొక్క మిత్రుడైన సలీం. ( సాహి ముస్లిం గ్రంధము 31 సంఖ్య 6024 )

ఇంకొక హద్దిత్ ప్రకారం ఇబ్న్ మసూద్, ఉబయి మరియు జైద్ లు కాక ఇంకో ఇద్దరు కూడా కురాన్ ను పొందుపరిచిరి.

అనస్ అన్న ప్రకారం :
అల్లాః ప్రవక్త జీవిత కాలములో నలుగురు వ్యక్తులు కురాన్ ను పొందుపరిచారు వారేవారంటే అన్సార్: మావుద్ బిన్ జబల్, ఉబయి బిన్ కాబ్, జైద్ బిన్ తబిత్ మరియు అబూ జైద్. అందుకు అనస్ అబూ జైద్ ఎవరు? అని అడుగగా అతను నా మామ / చిన్నాన్న ల లో ఒకరు అని చెప్పెను. ( సాహి ముస్లిం గ్రంధము 31 సంఖ్య 6029 )

ఈ లేఖనము జైద్ ఇచ్చిన సాక్ష్యము అయిన అల్లాః ప్రవక్త జీవిత కాలంలో కురాన్ పొందుపరచబడలేదు అనే దానిని ఉల్లంఘించినప్పటికీ, జైద్ సమకూర్చే సమయములో అప్పటికే కురాన్ సమకూర్చబడి వాడుక లో ఉన్నదన్న మాటను ధృడ పరుస్తున్నది. ఇందు మూలముగా ముస్లిం సమాజములో ఒకరి పై ఒకరు అల్లాః గ్రంధములో దుర్బొదలు చేర్చారన్న ఆరోపణలు చేసుకొన్నారు. దీని మూలముగా మూడవ ఖలీఫా అయిన ఉత్మన్ కఠినమైన నిర్ణయములను చేయుటకు దారి తీసెను.

కురాన్ పై ప్రాంతీయ విభేదాలు ఉన్న విషయమును గమనించి అదర్బైజాన్, ఆర్మేనియా సరిహద్దులలో ఇరాక్ మరియు సిరియా సేనలను కలిపే పనిలో ఉన్న హడైఫా బ. అల్ యమేన్ ఉత్మన్ వద్దకు వచ్చెను. “విస్వాసుల సేనాపతి” అని సంభోదిస్తూ “ఈ ఉమ్మా ను (విస్వాసుల సమాజమును) యూదులు, క్రైస్తవులవలె పుస్తకము పై భిన్నాభిప్రాయములు కలిగియుండక ముందే మీ చేతులలో తీసుకోండి” అని హితవు చెప్పెను. అప్పుడు ఉత్మన్, హఫ్సా వద్దకు ఆమె తన తండ్రి నుండి పొందిన కురాన్ గ్రంధమును అరువు తెచ్చుటకు పంపెను తద్వారా వాటిని పలు ప్రతులలోనికి వ్రాయించ గలరని అతని ఉద్దేశ్యము. ఆమె తన వద్ద నున్న సుహుఫ్ (కురాన్ ప్రతి) ని ఇచ్చిపంపగా ఉత్మన్ జైద్, సైద్ బి అల్ అస్, అబ్దుల్ రహ్మాన్ బి అల్ హరిత్ బి హిషాం మరియు అబ్డుల్లః బి జాబైర్ లను ఆ ప్రతిని పలు ప్రతులలోనికి వ్రాయమని ఆదేశించెను. కురైశ్ సమూహమును సంభోదిస్తూ, ఎక్కడైనా జైద్ యొక్క కురాన్ తో మీరు ఏకీభవించకపోతే దానిని కురైశ్ యాసలో నమోదుచేయుడి ఎందుకనగా మొట్ట మొదట కురాన్ ఆ యాసలోనే ప్రకటింప బడినది కదా అని అనెను. వారు కురాన్ యొక్క ప్రతులను వ్రాయటం ముగించిన తరువాత ఉత్మన్ వాటిలోని ఒక్కొక్క ప్రతిని రాజ్యములోని ఒక్కొక్క ముఖ్య కేంద్రమునకు పంపి ఇవికాక వేరే ఏ కురాన్ ప్రతినైన, ఒకే పత్రములో ఉన్నా లేకా పుస్తక రూపములో ఉన్నా, తగులబెట్టమని ఆజ్ఞాపించెను. (బుర్టన్ 141 – 142 ఫత్ అల్ బారి వాల్యూం 9 పేజి 18).

హుదైఫా వేరొక హద్దిత్ లో ఇరాక్ మరియు సిరియా ముస్లిముల మధ్య కురాన్ విషయమై విబేధముమాత్రమే కాక ఇరాకి ముస్లిములలోని విరోధ సమూహములలో కూడా విబేధము గమనించినట్లు ప్రస్తావించెను.

“మేము మసీదులో కూర్చుని, అబ్డుల్లః మా మధ్య కురాన్ ను వల్లించు చుండగా హుదైఫా అక్కడికి వచ్చి ” ఇబ్న్ ఉమ్మ్ అబ్ద్ ( అబ్డుల్లః) యొక్క కురాన్ వల్లిక మరియు అబూ ముసా యొక్క కురాన్ వల్లికను విని ! నేనే గనక విస్వాసుల సేనాపతి వద్దకు వెళ్ళగలిగితే, ఆయనను ఒకే కురాన్ వల్లిక ను మానిక గా ఆజ్ఞాపించమని సిఫార్సు చేయుదునని చెప్పెను”. ( బుర్టన్ 142 )

పై హద్దితులను పరిశీలించినప్పుడు మనకు అర్థమైయ్యే ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఇస్లాం ప్రచారకులు చెప్పే విధముగా కాక, కురాన్ వల్లికలలో చాలా విభేదాలు మరియు వైరుధ్యములు ఉన్నవి అని. ఆలోచించదగ్గ మరియు ఆశ్చర్యం చెందవలసిన విషయం ఏమిటంటే వారి మధ్య ఉన్న వైరుధ్యములు / విభేదాల కారణంగా ఉత్మన్, మొహమ్మద్ గారు కురాన్ ను వల్లించునప్పుడు విన్న మరియు చూసిన వారు వ్రాసిన లేఖనములను తగులబెట్ట వలసి వచ్చినది. అటుతరువాత ఉత్మన్, జైద్ చే సమకూర్చబడిన కురాన్ ను అధికారికముగా ప్రకటించి తన నిర్ణయమును ముస్లిం సమాజము పై రుద్దారు. ఆ నిర్ణయము దేవుని జ్ఞానముతో తీసుకొన్నది గా కాక ఒక వ్యక్తి ఇష్టముగా కనిపిస్తున్నది.

ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఏమిటంటే ఇబ్న్ మసూద్ మరియు ఉబ్బే బిన్ కాబ్ వంటి వారిచే పొందు పరచబడిన కురాన్ ప్రాచుర్యములో ఉన్న సమయములో (వీరిరువురు మొహమ్మద్ చె శ్రేష్టమైన కురాన్ వల్లించే వారిగా ప్రశంసింపబడిన వారు) అధికారికం చేయుటకు అన్ని అర్హతలు కలిగిన ఈ కురానులను కాదని వాటిని తగలబెట్టే అధికారం ఉత్మన్ కు ఎవరు ఇచ్చారు?

ఉబ్బే మరియు ఇబ్న్ మసూద్ లు వారి జ్ఞాపక శక్తి వలన ఎంతో ప్రచులితమైన వారు. ఉబ్బే కురాన్ వల్లించుట లో అతి శ్రేష్టుడిగా పిలువబడేవాడు, మరియు ఇబ్న్ మసూద్ తప్పు లేకుండా 70 సురాలు వల్లించగల సమర్థుడు.

అబ్డుల్లః బిన్ మసూద్ వ్యాఖ్యానము:
(అతను తన సహవాసులతో వారి కురాన్ ప్రతులను దాచి ఉంచమని చెప్పెను): ఎవరు దేనినైతే దాచి పెట్టుడురో దానిని తీర్పు జరిగే దినమున అల్లాః ముందు తేవలయును అని చెప్పెను. అందుకు వారు ఎవరి వల్లిక (కురాన్ వల్లిక) విధానములో నీవు మమ్ములను కురాన్ ను వల్లించుటకు అడుగుదువని అడిగిరి. “నేను నిజానికి అల్లాః ప్రవక్త ఎదుట 70 పై చిలుకు సూరాలను వల్లించితిని మరియు పుస్తకము పై నాకున్న అవగాహన (వారికున్న అవగాహన కంటే) ఉత్తమమని అల్లాః ప్రవక్త యొక్క సహవాసులకు తెలుసు. ఒక వేల నాకంటే గొప్ప అవగాహన కలిగిన వారు ఉన్న యడల నేను వారి యొద్దకు వెల్లుదును గదా” అని చెప్పెను. అందుకు శకిక్  “నేను అల్లాః ప్రవక్త యొక్క సహవాసుల సాంగత్యములో ఉంటిని కానీ నేను వారిలో ఎవరూ ఈ వల్లిక ( బిన్ మసూద్ యొక్క కురాన్ వల్లిక) ను తిరస్కరించగా లేక తప్పు పట్టాగా చూడ లేదు” అని చెప్పెను. (సాహి ముస్లిం గ్రంధం 31 సంఖ్య 6022 )

జైద్ క్రోడీకరించిన కురాన్ అధికారికతను సంతరించుకొందని తెలిసిన సమయములో ఇబ్న్ మసూద్ ఈ విధముగా ప్రతిస్పందిచెను “నేను, జైద్ ఇస్లాంను అంగీకరించక ముందే అల్లాః ప్రవక్త ఎదుట 70 సూరాలను వల్లించి వాటిలో నిష్ణాతుడను అయితిని” (ఇబ్న్ అబి దావూద్ కితాబుల్ మసహిఫ్)

ఇంకా తెలుసుకోవలసిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇరాక్ లోని ముస్లిం సమాజము ఉత్మన్ కురాన్ కంటే ఇబ్న్ మసూద్ కురాన్ కే ఎక్కువ విలువ ఇచ్చిరి. దీనివలన హదైఫా మరియు ఇబ్న్ మసూద్ల మధ్య ఒకరినొకరు ఎదుర్కొనే పరిస్థితి వచ్చెను. ఇది చాలదని ఇతర కురాన్ వల్లికలలో ఉండే కొన్ని సురాలు ఉత్మన్ కురాన్ లో నమోదు కాబడలేదు.

ఇబ్న్ ఉమర్ మరియు ప్రవక్త భార్య అయిష ప్రకారముగా ఒక సురా / అధ్యాయము, సుర అల్ అహ్జాబ్ (33) నందు 200 వచనములు మొహమ్మద్ సమయములో ఉండెను కానీ ఉత్మన్ క్రోడీకరించిన కురాన్ లో కేవలం 73 వచనములు మాత్రమే ఉన్నవి. ఈ హద్దిత్ ఉబ్బే బిన్ కాబ్ ద్వారా ధ్రువ పరచ బడినది. True Guidance, p. 61– అల -సుయూతి’స్ అల్ -ఇట్క్యన్ ఫీ ఉలుం అల్ -కురాన్ on నసిఖ్ వ మన్సుఖ్ మరియు దర్వాజా యొక్క అల్ -కురాన్ అల -మాజిద్ )

అలాగే కురాన్ ప్రకటింపబడిన సమయములో అచ్చులు (అరబిక్ భాషలో) ఉండెడివి కాదు. సందర్భాను సారముగా ఒక పదమును అర్థం చేసుకునే వారు. కనుక వ్రాయబడిన ఒక మాటకు ఎన్నో రకాల అర్థాలు సందర్భానుసారముగా ఉండేవి. అంతే కాక హద్దిత్ ల ప్రకారం జైద్ చె కూర్చబడిన కురాన్ ను మెదిన ప్రాంత గవర్నర్ అయిన మర్వన్ నాశనము చేయించెను. కితాబ్ అల్ మసాహిఫ్ లో సలీం మాటలాడిన ఈ మాటలను ఇబ్న్ అబూ దావూద్ రచించెను: హఫ్సా మరణానంతరం మేము ఆమె అంత్య క్రియల నుండి వచ్చుచుండగా మర్వన్ హఫ్సా తమ్ముడైన అబ్డుల్లః బెన్ ఒమర్ వద్దకు, ఆమె(హఫ్సా) వద్ద ఉన్న కురాన్ ను తీసుకురమ్మని పంపెను. అబ్డుల్లః బెన్ ఒమర్ ఆ ప్రతులను పంపగా మర్వన్ వాటిని చింపివేసెను. అప్పుడు అతను ఈ పుస్తకము లో వ్రాసిన ప్రతి విషయము అధికారికమైన కురాన్ లో కూడా వ్రాసి ఉంది కనుక నేను ఇలా చేసితినని ఎందుకనగా కొన్నిదినముల తరువాత ప్రజలు ఈ ప్రతిలో వ్రాయబడని సంగాతులున్నాఎమో అని అనుమానిన్చుదురు అని చెప్పెను.

ఇలా అబూ బకర్ (మొహమ్మద్ స్నేహితుడు మరియు మామ) యొక్క అధికారములో వ్రాయబడిన కురాన్ ను నాశనము చేయవలసిన అవసరం మర్వన్ కు ఏమిటి? ఒక వేల ఈ పుస్తకములో అన్ని వ్రాసి ఉంటె ప్రజలకు అనుమానము ఎందుకు కలుగుతుంది?