ఓట్టేసి చెప్పవా!!

0
112

బైబిలు గ్రంథం ఒట్టు పెట్టుకోవడం గురించి చాలా స్పష్టమైన వైఖరిని అవలంభిస్తుంది.

ఒట్టు వేయటానికి అవసరత అసలు ఒక విశ్వాసికి రాకూడదు అని యేసు క్రీస్తు వారు చెప్పారు. ఒక విశ్వాసి అవును అంటే “అవును” కాదు అంటే “కాదు” అయి ఉండాలి అనేది యేసుక్రీస్తువారి నైతిక స్థాయి.

మత్తయి 5:37:
“మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది.”

పాత నిబంధన గ్రంథములోని సూత్రము ప్రకారము ఒకవేళ ప్రమాణము చేయవలసి వస్తే లేక ఒట్టు పెట్టుకోవలసి వస్తే నమ్మదగిన దేవునితోడు అని యెహోవపై మాత్రమే ఒట్టు పెట్టుకోవాలి.

యెషయా  65:16:
“దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.”

గమ్మత్తుగా ఇస్లాం సాహిత్యములో కూడా ఇదే సూత్రం మనం చూడవచ్చు. సహీ అల్ బుఖారీ 5 వ వాల్యూము, 58 వ పుస్తకము 177 వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది (తర్జుమా మాది) – ఉమర్ వ్యాఖ్యానము: ప్రవక్త అన్నారు “ఒక వేళ ఎవరైనా ఒట్టు పెట్టుకోవలసి వస్తే అల్లాహ్ పై మాత్రమే ఒట్టు పెట్టుకోవాలి” కురైష్ జాతి వారు వారి పితరులపై ఒట్టు పెట్టుకొనే వారు, కానీ అల్లాహ్ ప్రవక్త అన్నారు “అలా పితరులపై ఒట్టు పెట్టుకోవద్దు” ఇదే పద్ధతిలో మహమ్మద్ గారు సహిహ్ అల్ బుఖారి లో వాల్యూం 8 పుస్తక సంఖ్య 78 లో కూడా ఇవే మాటలు చెప్పినట్టు మనం చూడగలం. కాకపోతే వచ్చే చిక్కు ఏమిటంటే కేవలం అల్లాహ్ మాటలే ఉండే ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉంది: “మహమ్మద్! నీ ప్రభువు సాక్షిగా ! వారు తమ తమ పరస్పర విబేదాల విషయములో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించేంత వరకు…( తెలుగు ఇస్లామిక్ వారి తర్జుమా)

నీ ప్రభువు సాక్షి! వారు తమ వివాదాల పరిష్కారం కోసం నిన్ను న్యాయ నిర్ణేతగా అంగీకరించి… (ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ వారి తర్జుమా)

ఇక్కడ అల్లాహ్ మాట్లాడుతూ “నీ ప్రభువు సాక్షి” అని చెప్పడం గమనించండి. అల్లాహ్ తనపై తానే ఒట్టు పెట్టుకుంటున్నట్టు మనం చూడగలం.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే…అల్లాహ్ ఖుర్’ఆన్ లో వేటి వేటి మీద ఒట్టు పెట్టుకున్నాడో క్రింది సూరాలను గమనించి చూద్దాం.

సురా 15:72:- ప్రవక్తా! నీ ప్రాణం సాక్షిగా! అని ఉంది.

సురా 36:1:- వివేక విలసితమైన ఖుర్ఆన్ సాక్షిగా! అని ఉంది

సురా 43:1:- స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! అని ఉంది

సురా 51:1 :- దుమారం రేపే గాలుల సాక్షిగా! అని ఉంది

సురా 51:7:- విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా! అని ఉంది

సురా 52:1:- తూర్ పర్వతం సాక్షిగా! అని ఉంది

సురా 53:1:- అప్పుడే అస్తమించిన నక్షత్రం సాక్షిగా! అని ఉంది

సురా 68:1:- కలం సాక్షిగా ! అని ఉంది

సురా 74:32 – చంద్రుని సాక్షిగా, మరలి పోయే రాత్రి సాక్షిగా! అని ఉంది.

పాయింట్ నం: 6 :

అల్లాహ్ ఒట్టు ఎలా వేస్తున్నాడో చూద్దాం. దానికంటే ముందుగా మనుష్యులు తమ మధ్య వివాద అంశాన్ని తీర్చుకొనేటప్పుడు, ఒట్టు వేసేటప్పుడు తమ కంటే గొప్ప వారిపై వేస్తారు, చిన్నపిల్లలు సహితం అమ్మ మీద ఒట్టనో, నాన్న మీద ఒట్టనో లేక దేవుని మీద ఒట్టనో అంటారుగాని, పుస్తకాలు మీదనో, పెన్ను మీదనో, ఇంకా ఏదైనా జంతువుల మీదనో ఒట్టు వేయరుకదా! మన దేవుడైన “యెహోవా” బైబిల్ లో అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు “తమకంటే ఏ గొప్ప వానితోడు అని ప్రమాణం చేయలేకపోయెను” అని చదువుతాము. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాడు ఎవరూ లేరు. అందుకనే ఆయన “తన తోడని” ప్రమాణము చేసెను. ఈ విషయములను హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6:13వ వచనములో చదవగలము.

హెబ్రీయులకు 6:13-14 :
“దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవాని: తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక, తనతోడు అని ప్రమాణముచేసి: “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.”

యిర్మియా 22:5 వచనములో, ఇంకా అనేక బైబిల్ రిఫరెన్స్ లలో మన దేవుడైన యెహోవా “నా జీవము తోడు, నాతోడని” ప్రమాణము చేసినట్లు చూస్తామే గాని, ఖురాన్ లోని అల్లాహ్ మాత్రం తనకంటే అల్పమైన దానిమీద ప్రమాణము చేయడం చాలా విచిత్రముగాను బైబిల్ లోని మన “యెహోవా” దేవుని స్వభావానికి సరిగ్గా వ్యతిరేకముగాను కనిపిస్తుంది. అది ఖురాన్ నుంచే చూద్దాము.

యిర్మియా 22:5:
“మీరు ఈ మాటలు వినని యెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.”

ఖూరాన్ 36:2లో “ఖురాన్ సాక్షిగా” అని,

ఖురాన్ 53:1 వచనములో “నక్షత్రముల సాక్షిగా” అని,

ఖురాన్ 52:1 – 6 వచనములలో తూర్ పర్వతం సాక్షిగా” ఎత్తెన కప్పు సాక్షిగా, అల్లకల్లోలపు సముదరం సాక్షిగా” అని,

ఖురాన్ 74:32-34 ప్రకారం “చంద్రుడు, రాత్రి, ఉదయముల సాక్షిగా” అని,

ఖురాన్ 86:1వ వచనములో “వర్షాన్ని కురిపించే ఆకాశము సాక్షిగా” అని,

ఖురాన్ 91:1-7 ప్రకారం. “సూర్యుడు సాక్షిగాను, చంద్రుడు సాక్షిగాను, పగలు సాక్షిగాను, రాత్రి సాక్షిగాను, ఆకాశము సాక్షిగాను, నేల సాక్షిగాను, మానవ అత్మ సాక్షిగాను” అని ఉంది,

ఖురాన్ 68:1 ప్రకారం “కలము లేక పెన్ను సాక్షిగా

ఖురాన్ 95:1 అత్తి, ఆలివ్ లు సాక్షిగా, “అని అల్లాహ్ ఒట్టు వేసుకొనెను.

అల్లాహ్ ఒట్టు వేసుకున్న ప్రతిధి అల్లాహ్ కన్న అల్పమైనదా లేక అల్లాహ్ కన్న గొప్పదా? తను సంకల్పిస్తే విటన్నిటిని కూడా సునాయసంగా నాశనం చేయగలను అని అల్లాహ్ నే చెప్పినట్టుగా ఖురాన్ లో చుస్తాము.

ఖురాన్ 35:16 “ఆయన కోరితే, మిమ్మల్ని తొలగించి, మరేదైనా సృష్టిని మీ స్థానంలో తీసుకురాగలడు”.

ఖురాన్ 14:20 “ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించగలడు. మీ స్థానంలో మరొక క్రొత్త సృష్టిని తీసుకు రాగలడు. అలాచెయ్యటం ఆయనకు ఎంతమాత్రం కష్టం కాదు” అని ఉంది.

పెన్ను, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రముల వంటి వాటి పై అల్లాహ్ ఒట్టు పెడుతునే, తను సంకల్పిస్తే వాటన్నింటిని సునాయసంగా నాశనం చేయగలను అంటే, అటువంటి ఒట్టు యొక్క విలువేమైనా ఉంటుందా? తను ఒట్టు పెట్టుకునే వాటినే సునాయాసంగా నాశనం చేయగలను అని అల్లాహ్ అంటే, ఆ ప్రమానాన్ని అల్లాహ్ నెరవేరుస్తాడని ఎమైనా నమ్మకం ఉంటుందా?

యెహోవా దేవుడు తనకంటే గొప్పవాడు ఎవరూ లేరు గనక తన తోడని, తన జీవము తోడని ప్రమాణం చేస్తే, అల్లాహ్ మాత్రం సృష్టిలోని రకరకాల వస్తువులపై ఒట్టుపెట్టుకున్నాడు. కాబట్టి బైబిల్ లోని యేహోవా దేవుడు, ఖురాన్ లోని అల్లాహ్ ఒక్కరే ఎలా అవుతారో సహో: హుస్సేన్ గారు వివరించాలి?

ఇలా చెప్పుకుంటూ పోతే దేవదూతల సాక్షిగా, సంధ్యాకాల ఎరుపు సాక్షిగా అని చాలా వాటిపై అల్లాహ్ ఒట్టు పెట్టుకుని చెప్పే సన్ని వేశములు ఎన్నో చూడవచ్చు.

బైబిల్ గ్రంథంలోని భక్తులు దేవుని పై తప్ప ఇంకెవరిపైనా ఒట్టుపెట్టుకున్నట్టు చూడలేము. రోమీయులకు వ్రాసిన పత్రికలో పౌలు దేవుని తన సాక్షిగా చేసుకుని మాట్లాడటం గమనించవచ్చు (రోమా 1:9-10).

రోమీయులకు 1:10:
“మిమ్మును గూర్చి యెడ తెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.”

అలాగే 2 కొరింథీ 1:23, గలతీ 1:20 లలో కూడా పౌలు దేవుని సాక్షిగా చేసుకుని మాట్లాడటం మనం గమనించ గలం . బైబిల్ మొత్తంలో కూడా భక్తులు దేవుని పై తప్ప ఇంకెవరి పైనా ఒట్టు పెట్టుకోవడం చూడలేము.

2కోరింథీయులకు 1:23:
“మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.

గలతియులకు 1:20:
“నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు.”

ఇక అసలు విషయానికి వస్తే, ఖుర్ఆన్ గ్రంథం ఇంకో మాట కూడా అంటుంది,అదేమిటంటే,

ఖురాను 29: 46:
“మరియు నీవు గ్రంథప్రజలతో – దుర్మార్గాన్ని అవలంబించినవారితో తప్ప – కేవలం ఉత్తమమైన రీతిలోనే వాదించు. మరియు వారితో ఇలా అను: “మేము మా కొరకు అవతరింప జేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింప జేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్యదేవుడు ఒక్కడే (అల్లాహ్‌). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము.”

అల్లాహ్ స్వయంగా మహమ్మద్ గారికి చెబుతున్నారు గ్రంథ ప్రజల దేవుడు (అనగా బైబిలులోని దేవుడు) మరియు ఖుర్ఆన్ లో చెప్పబడిన దేవుడు ఒక్కరే.

బైబిలులోని దేవుడు తనపై తప్ప వేరెవరి పైనా ఒట్టు పెట్టుకోనివ్వడు. ఖుర్ఆన్ లోని దేవుడు మాత్రం చాలా వాటిపై తానే ఒట్టు పెట్టుకుంటాడు . కాబట్టి వీరిద్దరూ ఒకే దేవుడు అని చెప్పలేం. ఒక వేళ ముస్లీములు బైబిల్ చెప్పేది మేము విశ్వసించవలసిన అవసరం లేదు అంటే నిజానికి ఖురానే బైబిలులోని దేవుడు మరియు ఖుర్ఆన్ లోని దేవుడు ఒకటే అని చెబుతోంది.

కనుక మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగేది ఏమిటంటే మొహమ్మదుగారు ప్రకటించిన దేవుడు మరియు బైబిల్ ప్రకటించే దేవుడు ఒకరు కాదు.

సత్యానికి అసత్యానికి ఈ మాత్రం తారతమ్యం చాలు కదా!