ముస్లిములకు సవాలు!!!

0
189

తరచూ ముస్లిములు యేసు నేను దేవుడను నన్ను ఆరాధించండి అని ఎక్కడ చెప్పాడో బైబిల్ నుండి చూపించవలెనని అడుగుతూ ఉంటారు. వారి ప్రశ్న లో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కంటే వేలెత్తి చూపాలన్న ఆశ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. యేసు దేవుని స్వరూపమని ఆయన యెహోవా దేవుని అద్వితీయ కుమారుడని, ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ రాలేరని పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఒక్కడే మార్గమని ఆయన పలు సందర్భాలలో శిష్యులచేత మరియు ఇతర ప్రజల చేత ఆరాధనలను స్వీకరించి అందుకు యోగ్యుడనని చాటుకున్నాడు.

ఇవన్ని కాకున్నా దేవుడే ఆయనను మెచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందిచుచున్నాను, ఈయన మాట వినుడి, అని చెప్పినట్టు బైబిల్ చెపుతున్నపట్టికి కేవలం యేసు తను మాట్లాడిన అరమైక్ భాషలో నేను దేవుడిని నన్ను ఆరాధించండి అని చెబితేనే మేము ఆయన దేవుడని నమ్ముతాము అనడం లో ఉన్న మర్మం చదివే వారు గమనించాలి.

  • ఈ తర్కాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిములకు మా సవాల్!క్రీస్తు తరువాత 6 శతాబ్దాలకు కానీ ఇస్లాం, దాని సాహిత్యాలు పుట్టని తరుణములో సైతం వారు వ్రాసుకున్న సాహిత్యాలు మరియు అల్లాః చే నేరుగా స్వర్గం నుండి పంపబడినది అని చెప్పుకొనే కురాన్ లో ఎక్క డైనా యేసు “నేను దేవుని కుమారుడను కాను, నేను దేవుడను కాను, నన్ను ఆరాదించకండి , నేను మీ పాప క్షమాపణ నిమిత్త మై చనిపోలేదు” అని తనంతట తానే తన భాష అయిన అరమైక్ భాషలో చెప్పినట్టు చూపించాలి. కురాన్ లో అల్లాః చెప్పినట్టో లేక మొహమ్మద్ చెప్పినట్టో కాకుండా యేసయ్యే తన ఏక వచన ప్రయోగంతో ఈ మాటలు పలికినట్టు చూపించాలి. అవికూడా అరమైక్ భాషలో చెప్పబడి ఉండాలి. ఒక వేళ ఇలా చూపించ లేకపోతే వారు యేసు దైవకుమరుడేనని ఒప్పుకోవాలి.

అరమైక్ భాషలోనే మాకు ఎందుకు కావాలి అంటే, నూతన నిబంధన గ్రీకు భాషలో రచింపబడినది కనుక యేసు అరమైక్ వాడేవారు కనుక ముస్లిములు నూతన నిబంధన మాటలు యేసు మాట్లాడలేదు అని తర్కిస్తూ ఉంటారు. అలాగే యేసు అరబిక్ భాష కూడా మాట్లాడలేదు కనుక కురాన్ లో యేసు మాట్లాడిన అరమైక్ భాషలోని వచనాలను మాత్రమే చూపించాలి.

ఒక వేళ కురాన్ లో యేసు చెప్పకపోయినా కురాన్ రచయిత చెప్పారు కదా అని తర్కిస్తే అదే విధంగా బైబిల్ లో కూడా యేసు నేను దేవుడు అని చెప్పుకోక పోయినా ఆయన దేవుడని ఎంతో మంది ఆయన అనుచరులు చూసి, విని పలికిన మాటలు మనకు తాటికాయంత అక్షరాలతో కనిపిస్తాయి. అలా కాదు ఈ తర్కంలో పట్టు లేదు అంటే ముసిములు అడిగే విచక్షణ లేని ప్రశ్న లో కూడా అర్థం లేదని ఒప్పుకోవాలి.

  • అదేవిధంగా కురాన్ లో నుంచి ఒక్క వచనమును తీసి మొహమ్మద్ ఎక్కడ “నేను అల్లాః ప్రవక్తను” అని చెప్పుకున్నాడో చూపించాలి.
  • మొత్తం కురాన్ లో కేవలం 114 సూరాలు మాత్రమే ఉన్నాయి, ఇవన్ని కూడా అల్లాః చే మాత్రమే పంపబడ్డాయి అని ఒకే ఒక్క వచనం చూపించ గలగాలి.
  • సరిగ్గా అదే విధంగా ఒకే ఒక్క వచనంలో కురాన్ లోని సురాలకు పేర్లు ఇవ్వ బడిన సంగతి వాటి పేర్లు       చూపించ గలగాలి.

ఈ ప్రశ్నలకు సమాధానం ముస్లిములు చెప్పలేరు అని ఇస్లాం పై అవగాహన ఉన్న ఎవరికైనా యిట్టె అర్ధం అవుతుంది. కాకపోతే తర్కరహితంగా బైబిల్ పై మరియు యేసు దైవత్వం పై అర్థం లేని ప్రశ్నలు వేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ముస్లిం పండితులు ఎదురుకోక తప్పదు.