క్రైస్తవులుగా యోగాను మనం ఆచరించవచ్చునా?

0
185

ఈ ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలి అంటే ఆచరించకూడదు అని చెప్పాలి. మన ప్రధాని మోడీ తన హిందూ మతాన్ని అందరూ ఆచరించాలి అని చేయని విశ్వప్రయత్నం లేదు. ఒకప్పుడు R.S.S లీడర్ గా ఒక వెలుగు వెలుగు వెలిగిన ప్రధాని మోడీకి వున్న ఈ ఆసక్తి ఆశ్చర్యం కలిగించేది ఏమి కాదు. ఇటీవల ఈయన గారు జూన్ 21 ను ప్రపంచ యోగా ధినోత్సవముగా ప్రకటించారు అయితే ఒక్క మన భారతదేశం తప్ప ఇతర దేశాలు ఈ అంశం పై కన్నెత్తి కూడా చూడలేదు. ప్రపంచం మొత్తం హిందూ మతం వైపు తిరగాలని ఈయన ఆకాంక్ష కాబోలు. అయితే దేవుని జ్ఞానం లేని కొంతమంది క్రైస్తవులు కూడా ఈ యోగా ధినోత్సవమును ఆనందముగా జరుపుకున్నారు. ఇంకా బాధించదగిన విషయం ఏదనగా “ప్రభువుదినమైన” ఆదివారమును కొంతమంది సంఘకాపరులు వారి వారి సంఘాల్లో జరుపుకున్నారు (Church Service that Included Yoga).

సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. యోగా అంటే ఏమిటి? “యోగా అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది దీని అర్ధం “ఏకమవుట” లేక “కలిసిపోవుట”. యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం “ముక్తిని లేక రక్షణను పొందుట”. యోగాలో అనేకమైన పద్ధతులు వున్నాయి. “ధ్యానం” అన్నీ యోగా పద్ధతులకు మూలమై వున్నది. మరి ఈ ధ్యానం అనగా ఏంటో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. “ధ్యానం అనగా మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం”. ఇలా మనుష్యుని ఆత్మను, బ్రహ్మ అనే దేవుని ఆత్మతో సంధి చేయటాన్ని మోక్షం (Moksha) అంటారు. ఎంత అవివేకం క్రీస్తు యేసునందు దేవుడిచ్చే ఉచిత రక్షణను (ఎఫిసీయులకు 2: 8 – 9) మనుష్యులు వారి సాధనతో కొనుక్కోవాలి అనుకోవటమా?. క్రైస్తవుడిగా అది ఎన్నటికీ మనం చేయకూడదు. ఇప్పుడు అర్ధమైంది అనుకుంటున్నాను యోగా యొక్క ముఖ్య వుద్దేశ్యం ఏమిటో.

ఆరోగ్యకరమైన ఉపయోగాలు వుంటే యోగాను క్రైస్తవులు ఎందుకు చేయకూడదు: ఈ సందేహం చాలా మంది క్రైస్తవులలో కలుగుతుంది. మనం ప్రతి రోజూ చేసే వ్యాయామాల వలన మనకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ఆరోగ్యముగా ఉండుటకు ఇటువంటి వ్యాయామాలు చేయటంలో క్రైస్తవులకు ఎటువంటి తప్పు లేదు. అయితే యోగా అభ్యాసము చాలా భిన్నమైనది. యోగాలో వ్యాయామము మాత్రమే లేదు, యోగా వ్యాయామముతో కూడిన ధ్యానము. యోగా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏదనగా “మనసును, శరీరమును, ఆత్మను యేకము చేసి దానిని బ్రహ్మ అనే దేవునితో జతపరచటం” ఇధి వ్యర్ధమైన ప్రయత్నం.

  • మన రక్షణకు యేసే మార్గం. ఈ రక్షణను వివిధ పద్ధతుల ద్వారా కొనుక్కోలేము.

యోహాను 14: 6:
“యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”.

అపోస్తులుల కార్యములు 4: 12“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను”.

  • యేసుక్రీస్తు నందు విశ్వాసంచేత దేవుడిచ్చిన కృపావరమే “రక్షణ” మరే విధముగా దానిని పొందలేము.

ఎఫిసీయులకు 2: 8 – 9:
“మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు”.

  • మనం క్రైస్తవులము ఈ లోక సంభందులం కాదు అని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ లోకసంభందులు అనేక వ్యర్ధమైన క్రియలు చేస్తూ వుంటారు వాటన్నిటికీ మనం దూరముగా వుండాలి.

రోమియూలకు 12: 2:
“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”.

  • ఒక క్రైస్తవుడిగా దేవుని వాక్యమే మనము ధ్యానించాలి గాని , వ్యర్ధమైన నామములు కాదు. మరే నామము వలన రక్షణ కలుగదు గాని యేసయ్య నామమందు మాత్రమే రక్షణ కలుగును (అపోస్తులుల కార్యములు 4: 12)

కీర్తనలు 1:2:
“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు”.