ప్రభువైన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు ఒక్కరేనా?

0
171

కాదు. యేసయ్య, తండ్రి అయిన దేవుడు ఒకరు కాదు. త్రిత్వం అను విశ్వాసములో దేవుని శిరస్సు నందు ముగ్గురు వ్యక్తులు కలరు. వీరు “తండ్రి”, “కుమారుడు”, పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను వ్యక్తులు అని సంభోదిస్తున్నాను. అంటే వీరు ముగ్గురూ కూడా ఒక వ్యక్తికి వుండే గుణాలను సంపూర్ణముగా కలిగి వున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి చిత్తాన్ని, ప్రేమను, మాట్లాడే స్వభావమును కలిగి వున్నారు. అయితే బైబిల్ అంతా కూడా మనకు భోదించేది ఏమిటంటే “దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.

యెషయా 43: 10
మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.”

యెషయా 44: 6-8
ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.”

యెషయా 45: 5:
నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.”

యెషయా 45: 18
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.”

యెషయా 45: 22:
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.”

దీనిని బట్టి దేవుడు ఒక్కడిగా వుండి ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు గా ఉనికిలో వున్నాడు అని స్పష్టం అవుతుంది.

కుమారుడైన మన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు కాదు. వీరు ఒకరికి ఒకరు సంభాషించుకొందురు మరియు ఎవరికి వారు వారి వారి చిత్తాన్ని కలిగి వున్నారు. ఈ క్రింది వచనములలో వీరి సంభాషణను మీరు గమనించవచ్చును.

మత్తయి సువార్త 3: 17
“మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను”.

లూకా సువార్త 22: 43:
“తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి తొలగించుటకు నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.

అయితే దేవుడు ఒక్క వ్యక్తే అని విశ్వసించే పెంతెకోస్తులు కూడా కలరు. వీరు త్రిత్వమును, దేవుని శిరస్సును విశ్వసించరు. వీరి వాదన ఏదనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురూ కూడా ఒక్క వ్యక్తే కాని ఆయన ముగ్గురు వ్యక్తులుగా మనకు కనబరచుకున్నాడు అని. ఈ వాదన దేవుని సంభందమైనది కాదు దుష్టుని సంభందమైనది. 1 యోహాను 2: 22 “యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి”. కనుక క్రీస్తు విరోధి తండ్రిని, కుమారుడిని ఒప్పుకొనడు.

కచ్చితమైన, నిజమైన విశ్వాసం యేదనగా “దేవుడు ఒక్కడిగా వుండి ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో వున్నాడు” అనేది. వీరు ముగ్గురు ఒకరికి ఒకరు వేరుగా వున్నారు. దీని అర్ధం ముగ్గురూ ముగ్గురు దేవుళ్ళని అర్ధం కాదు. దేవుడొక్కడే. ఈ అద్భుతమైన లక్షణం మానవ జ్ఞానంకు అందనిది. మానవ జ్ఞానం పరిమితమైనది ఈ పరిమిత జ్ఞానముతో అనంతుడు, అద్వితీయుడు అయిన దేవునిని అంచనా వేయగలమా మీరే ఆలోచించండి.