సౌలు ఏ విధముగా చనిపోయాడు? తనను తానె చంపుకున్నాడా? లేక అమాలేకీయుడి చేత చంపబడ్డాడ?

0
207

దేవుని వాఖ్యమైన బైబిల్ ని మనం పరిశీలించినట్లయితే సౌలు రెండు విధాలుగా చంపబడ్డాడు అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ క్రింది వాఖ్యాలను పరిశీలిద్దాం.

1 సమూయేలు 31:4
“సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.”

2 సమూయేలు 1:8-10
“నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను ? నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.”

1 సమూయేలు 31: 4:  వచనము “నిజానికి సౌలు ఏ విధముగా చనిపోయాడో వివరిస్తుంది”

2 సమూయేలు 1: 8-10: వచనము “అమాలేకీయుడు సౌలు మరణము గురించి ఏ విధముగా తెలియచేసాడో వివరిస్తుంది.”

సౌలు, సున్నతిలేని వారి (ఫిలిష్తీయులు) చేతిలో మరణము నొందుట ఇష్టము లేక  తనని తానే చంపుకున్నాడు. అయితే అమాలేకీయుడు దావీదు వద్ద నుండి ఏదన్నా ప్రయోజనము చేకూరుతుంది అని “సౌలు”ను నేనే చంపాను అని దావీదుకు  అబద్ధం చెప్పాడు.

అయితే అనూహ్యంగా దావీదు “దేవునిచే అభిషేకించబడిన సౌలును చంపెదవా” అని….ఆ అమాలేకీయుడిని కొట్టి చంపించెను.

2 సమూయేలు 1: 13-16:
“తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. అందుకు దావీదుభయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.