దావీదును ప్రేరేపించినది ఎవరు?

0
882

ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను (2 సమూయేలు 24:1).

తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా… లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనులయొక్క అధి పతులకును మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను (1దినవృ 21:1).

జనులను లెక్కపెట్టమని ప్రేరేపించినది యెహోవా అని ఒక లేఖనములో వుంటే, సాతాను అని మరొక లేఖనములో వున్నది, ఇంతకీ ఏది వాస్తవం.

దీనికి జవాబు లేఖన పరిధిలోనే చూద్దాం.

వాస్తవానికి దేవుని బలముపై శక్తిపై ఆధారపడవలసిన దావీదు తన సైన్యసమూహమెంతుందో లెక్కపెట్టమని యోవాబును పురమాయిస్తాడు(ఈ ప్రేరేపణ సాతానుది), దేవునిపై పూర్తిగా ఆధారపడాలని దేవుని ఉద్దేశమైతే, దానికి భిన్నంగా సొంతశక్తిపై ఆధారపడమని మనిషిని సాతాను ప్రేరేపిస్తాడు.

ఐతే దేవుడు దానికి ఆంగీకరించకుండా యోవాబు ద్వారా బుద్ధిచెప్పాలని ప్రయత్నం చేసాడు యోవాబును, ఆ పనిలో భాగంగా యోవాబు ఇలా అంటాడు- నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను. ఐనప్పటికీ దావీదు ఒప్పుకోలేదు, తన మాటే వేదం అన్నరీతిగా లెక్కపెట్టాడు.

అసలు విషయమేమిటంటే, మనిషి తాను దేవునికి విరోధంగా ఆలోచించే కొన్ని నిర్ణయాలు సాతాను ప్రేరణ ద్వారా వస్తాయి, దేవుడు వాటిని తీసివేయాలనే ఉద్దేశముతో ఎవరో ఒకరి ద్వారా ఆటంకపరచడానికి ప్రయత్నించినప్పటికీ మనిషి స్వతహగా నేను అనుకున్నది చేసి తీరతాను అని భీష్మించుకుని కూర్చున్నప్పుడు దేవుడు అభ్యంతరం చెప్పడు ఎందుకంటే మనిషికి దేవుడు స్వేచ్చ ఇచ్చాడు కనుక. ఐతే మానవునికి దేవుడు ఇచ్చిన ఆ స్వేఛ్ఛను సాతాను దొంగిలించి తన స్వార్థానికి ఉపయోగించుకొని దేవునికి విరోధంగా కార్యాలు తలపెడతాడు ఆ పరిస్థితినే మనం “ సాతాను ప్రేరణగా చూస్తాము”(1దిన21:1). ఐతే చివరికి సాతాను కూడా దేవుని పరిధికి మించి పని చేయడు కనుక, దేవుడు అనుమతించిన ఆ ప్రేరణను కూడా మనం యెహోవా ప్రేరణగా చూడాలి అనేది జవాబు (2 సమూ21:1).

SHARE
Previous articleఅశ్లీలతకు, జారత్వమునకు దూరముగా ఉండుట ఎలా?
Next articleయేసును తొలుత ఎవరి యొద్దకు తీసుకెళ్ళారు? అన్నయొద్దకా (యోహాను -18:12), లేక కయపయొద్దకా (మత్తయి 26:57)?
నా పేరు సురేశ్ బాబు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపనీలో పని చేస్తూ హైదరాబాద్ లో నివసిస్తున్నాను. హైందవ కుటుంబములోనుండి ప్రభువును అంగీకరించాను. ప్రభువును మహిమార్థమై ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశముతో బైబిల్లో ఉన్నకొన్నికఠినాంశములపై పరిశోధన ప్రారంభించి సాక్షి అపొలొజెటిక్స్ బృందంలో పాలిభాగస్థునిగా వేదాంతరిత్యా B.Th; B.D పూర్తిచేసాను. ప్రభువు వలన నాకు కలిగిన అపేక్షను బట్టి “యేసుక్రీస్తు దైవతము”, “క్రీస్తుసంఘములో కులదోషం”, “మరో మేకవన్నెపులి ఎడ్వర్డ్ జయకుమార్”, “మృత్యుంజయుడు”, “విశ్వాసి తెలుసుకో” “యూదులు” అనే వ్యాసాలు వ్రాసాను. ప్రస్తుతం “యేసుక్రీస్తు సిలువ మరణ పునరుత్థానములకు లేఖన మరియు చారిత్రిక ఆధారములు” అనే అంశముపై పేపర్స్ వ్రాస్తున్నాను. నా గూర్చి, నా పరిచర్య గూర్చి ప్రార్థించండి.