Home Shop Atheism నాస్తిక నిందలు – బైబిల్ నిజాలు

నాస్తిక నిందలు – బైబిల్ నిజాలు

100.00

(బైబిల్ బాగోతం అనే శీర్షికతో కోన వీరబ్రహ్మం రాసిన 276 నాస్తిక విమర్శలకు క్రైస్తవ జవాబులు)

Category:

Description

బైబిలుకు వ్యతిరేకముగా ఒక నాస్తికుడు చేసిన విమర్శలను తిప్పికొట్టాలని మేము చేసిన ప్రయత్నములో అనేకమంది సహోదరీ సహోదరుల సహాయం, సహకారం, ప్రోత్సాహం మరియు ప్రార్ధన ఉంది. సహోదరుడు బిబు గారు నాస్తిక నిందలు లేఖన వెలుగులో పటాపంచలు చేస్తూ వ్రాసిన బైబిల్ సమాధానాలు తమ ప్రభువు పట్ల వారికున్న గౌరవాన్ని కూల్చడానికి అపవాది చేసే ప్రయత్నాలకు గొడ్డలిపెట్టులాంటివిగా ఉన్నాయి. క్రైస్తవ సమాజ దూషకులు మరియు క్రీస్తు వ్యక్తిత్వ విమర్శకులు ఎక్కువగా ప్రబలుతున్న ఈ కాలములో సహోదరుడు బిబు లాంటి క్రీస్తు సైనికులు లేవడం క్రీస్తు ప్రేమ సామ్రాజ్య స్ధాపనకు మరియు క్రైస్తవ దృక్పథ సమర్ధనకు ఎంతైనా అభిలషణీయం. సహోదరునికి ఉన్న క్రీస్తు మనస్సును పోలిన అణకువ మరియు తెగువ యావత్ క్రైస్తవ లోకానికే స్ఫూర్తిదాయకం మరియు ఈ పుస్తకములో ఆయన కనబరిచిన లేఖన అవగాహన సంఘము బలపడడానికి ఎంతో ఉపయోగకరం. ఈ పుస్తకము ప్రతి క్రైస్తవుని ఇంట్లో తప్పక ఉండవలసినది. మరీ ముఖ్యముగా ప్రతి యవ్వనుడు చదివి తీరవలసినది. దేవుడు ఈ పుస్తకము ద్వారా ఎంతో మంది హృదయాలలో ఉన్న అనవసర అపోహలను తీరుస్తూ రచించిన సహోదరుడు బిబు గారిని మరియు చదువుతున్న ప్రతి ఒక్కరినీ దీవించును గాక.

 

క్రీస్తు పరిచారకుడు

ప్రవీణ్ కుమార్ పగడాల

There are no products