Home Shop Uncategorized యెహోవా – అల్లాహ్ ఒక్కడేనా ?

యెహోవా – అల్లాహ్ ఒక్కడేనా ?

150.00

Out of stock

Category:

Description

తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా తనను తాను ప్రత్యక్ష పరుచుకున్న త్రిఏక దేవుని అనంత కృపలో ఆయన ఉనికిని వ్యక్తిత్వాన్ని మరియు ప్రత్యక్షతను ఉన్నది ఉన్నట్టుగా చాటడానికి మరియు “ఆ దేవుడే ఈయన” అని ఇతరులు మనకు పరిచయం చేస్తున్న తప్పుడు ప్రపంచ దృక్పథాలలో అతి ప్రాముఖ్యమైన ఇస్లాం మతానికి చెందిన వారు పరిచయం చేస్తున్న అల్లాహు ను లేఖనాధారముగా బైబిల్ లోని దేవుడు కాదని చెప్పే ఈ పుస్తకాన్ని వ్రాయడానికి యెహోవా దేవుడు నాపై చూపిన కృపకు ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించుకుంటున్నాను.

ఈ పుస్తక రచనలో నాకు తోడ్పడి, వారి సహాయ సహకారాలు అందించిన సాక్షి అపోలోజెటిక్స్ నెట్వర్క్ టీమ్ సభ్యులకు ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్నాను. వారి సహాయసహకారాలు లేనిదే ఈ పుస్తక రచన నిస్సందేహంగా చేయలేక పోయేవాడిని. దేవుడు ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఎంతో మంది కన్నులు తెరిచే విధంగా దీనిని ఉపయోగించకొనగలడని క్రైస్తవ దృక్పథాన్ని విడిచి ఇస్లాం వైపునకు వెళ్ళినవారు, అలాగే క్రైస్తవ దృక్పథాన్ని పరిశీలిస్తున్న ఇస్లాం మత అనుయాయులు ఈ పుస్తకము ద్వారా సత్యాన్ని తెలుసుకుని యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారని, అలాంటి అభిషేకాన్ని ప్రభువు దయచేయవలెనని ఆ దేవునికి ప్రార్ధిస్తున్నాను.

–  మీ ప్రవీణ్ కుమార్ పగడాల

There are no products