అల్లాహ్, యెహోవా ఒకరేనా?

కాదు ముమ్మాటికీ కాదు. ముస్లింలు తరచుగా క్రైస్తవులతో వాదించే విషయాలలో ఇది ముఖ్యమైనది. వీరి వాదనలు ఏవనగా మీ బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు మా అల్లాహ్ ఇద్దరూ కూడా ఒక్కటే, యేసయ్య కేవలం ఆయన సేవకుడు, యేసయ్య ఎప్పుడూ తనకు తాను దేవుడనని చెప్పుకోలేదు. ఇంక సహోదరుడు షఫీ గారైతే ఆదిలాబాద్ లో జరిగిన “రక్షకుడు ఎవరు” అనే తన ప్రసంగంలో “రక్షకుడు  ఎవరు? యేసా లేక యెహోవా అని పిలువబడే మా అల్లాహ్ న” అని గొంతు అరిగిపోయేలా కేకలు పెట్టడం మనం చూసాం (ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ చూడవచ్చు http://www.youtube.com/watch?v=13Ew3Fu8zj .

ఈయన ప్రసంగాన్ని, హావాభావాలను చూసిన జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఒక ఒంతైతే ఈయనకు తెలియని విషయం యేదనగా ప్రపంచములో బైబిల్ చదివిన ఏ క్రైస్తవుడు కూడా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అని ఒప్పుకోరు. అయితే దేవుడు మనకు ఇచ్చిన 1 పేతురు 3: 15 లోని “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి” ఆజ్ఞ ప్రకారం ఇటువంటి క్రీస్తు విరోధులకు ఒక క్రైస్తవుడుగా మనం సమాధానం చెప్పవలసిన అవసరత వుంది. మరి మొదలు పెడదామా?.

1. త్రిత్వము మరియు ఒంటరి దేవుడు:

మొట్టమొదటిగా క్రైస్తవుల దేవుడు త్రిత్వమై వున్నాడు ఒంటరి దేవుడు కాడు (త్రిత్వము గురించి మరింత సమాచారం కోసం http://www.tcarm.org/archives/6). అనగా క్రైస్తవ దేవుడు ఒక్క దేవుడిగాను ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు గాను ఉనికిలో వున్నాడు. అల్లాహ్ ఒంటరి దేవుడు అనగా ఒకే ఒక్క వ్యక్తి. మరి నా ప్రశ్న యేదనగా “ఈ ఒంటరి దేవుడు ఆకాశమును స్ప్రుష్టించక మునుపు, భూమికి పునాదులు వేయక మునుపు తన ప్రేమను, ఆలోచనలను ఎవరితో పంచుకున్నాడు.  దేవుడు అనంతుడు కదా! మరి అనంతుడైన దేవుడు అన్నీ లక్షణాలు కలిగి వుండాలి. అన్నీ లక్షణాలు కలిగి వున్నప్పుడు, ఒంటరి అయిన దేవుడు తన ఆలోచనలను ఎవరితో పంచుకుంటాడు? మీరే ఆలోచించండి.

2. అల్లాహ్ ఎవరికి తండ్రి కాదు :

ముస్లింల ప్రవక్త అయిన మొహమ్మద్ తన కురాన్లో భోదించినది ఏమనగా “అల్లాహ్ ఎవరికీ తండ్రి కాడు అందరూ కూడా ఆయనకు సేవకులము అనగా బానిసలము”.

యూదులు, క్రైస్తవులు తాము దేవుని బిడ్డలమని, ఆయనకు ప్రియమైన వారమని అంటారు. “మరి ఆయన మీరు చేసే పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు”? అని వారిని అడుగు. నిజానికి మీరు కూడా దేవుడు స్ప్రుష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే.దేవుడు తాను తలచిన విధముగా కొందరిని క్షమిస్తాడు, మరి కొందరిని శిక్షిస్తాడు. భూమ్యకాశములు వాటికి సంభందించిన సమస్తము దేవునివే. చివరికి అందరూ (ఓరోజు) ఆయన సన్నిధికే మరలి పోవలసి వుంది.

కురాన్ 5: 18

బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.

ద్వితియోపదేశకాండము 32: 6

కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

కీర్తనలు 2:7

మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.

యెషయా 63: 16

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.

మత్తయి సువార్త 6: 9

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

రోమీయులకు 8: 15

మొహమ్మద్ మనకు, మన ఆత్మకు తండ్రి అయిన  దేవునికి  ఉన్న భందాన్ని ఘోరంగా అపార్ధం చేసుకున్నాడు. మొహమ్మద్ యొక్క ఉద్దేశ్యం యేదనగా దేవుడు ఎవరితో శారీరక భందం పెట్టుకోడు ఆయనకు బిడ్డలు వుండరనేది. యూదులు, క్రైస్తవులు తాము దేవుని బిడ్డలమని అనకూడదు అని మొహమ్మద్ ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంత పొరపాటో మీరు గమనించండి దేవుని వాఖ్యమైన బైబిల్ మొత్తం కూడ మనం దేవుని పిల్లలమని, దేవుడు మన ఆత్మకు తండ్రి అని భోదిస్తుంటే యేసయ్య పరలోకం చేర్చబడిన 600 సంత్సరాల తరువాత వచ్చిన ఈ మొహమ్మద్ బైబిల్ భోదనలను విభేదిస్తూ భోధించిన వాటిని నమ్మాలో, లేదో మీరే ఆలోచించుకోండి. 1 యోహాను 2: 22 ప్రకారం  “యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి”. క్రీస్తు విరోధి తండ్రిని, కుమారుడిని ఒప్పుకొనడు కనుక ఎవరు క్రీస్తు విరోధో మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి.

3. యెహోవా మరియు అల్లాహ్ ప్రేమ:

దేవుడు తన వైపు మరలె వారిని, పరిశుభ్రముగా వుండే వారిని మాత్రమె ప్రేమిస్తాడు.

కురాను2:222

సత్యతిరస్కారుల్ని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు.

కురాను3: 31

ఇలాంటి సద్వర్తునులనే దేవుడు ప్రేమిస్తాడు.

కురాన్ 3: 134

అలాంటి సద్వర్తునులనే దేవుడు ప్రేమిస్తాడు.

కురాన్ 3: 146

కృతఘ్నుడు, పాపాత్ముడు అయిన వాడిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు.

కురాన్ 3: 276

దేవుడు కలహకారుల్ని ప్రేమించడు”.

కురాన్ 28: 77

ఫై వచనాలను చూసారా ఇది కురాను నందు ఉన్న దేవుని ప్రేమ.ఇప్పడు మన బైబిల్ నందు ఉన్న మన తండ్రి ప్రేమను చూద్దాం.

దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

1 యోహాను 4: 8

మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.

హోషేయా 3: 1

హోషేయా 2: 13 – 16

 యెషయా 54: 5 – 8

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

యిర్మియా 31: 3

వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?.

యిర్మియా 31: 9

యిర్మియా 31: 31 – 34

యోహాను సువార్త 3: 16 – 21

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

రోమీయులకు 5:8

1 యోహాను 4: 9 – 12

కురానులో ఉన్న దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే ఆయనకు లొంగి, ఆయన ఆజ్ఞలకు లోబడి వుండాలి. ఇది మన యేసయ్య మనకు భోదించిన దానికి ఎంతో భిన్నముగా వుంది. మత్తయి సువార్త 5: 46 “మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా”. దీనిని బట్టి బైబిల్ నందు ఉన్న దేవుడు, కురాను లో ఉన్న దేవుడికి ఎంత భిన్నముగా ఉన్నాడో స్పష్టం అవుతుంది. బైబిల్ నందలి దేవుడు నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని, ఆయనను ప్రేమించే వారిని, ప్రేమించని వారిని అందరినీ కూడా ప్రేమిస్తాడు.

4. అరబిక్ బైబిల్ నందు అల్లాహ్ నామం:

ముస్లింలు ఈ రోజు క్రైస్తవులను ఎంతగా మోసం చేస్తున్నారంటే “అరబిక్ బైబిల్ నందు దేవుడికి బదులుగా అల్లాహ్ అని వ్రాయబడినది కనుక బైబిల్ దేవుడు కురాను దేవుడు ఒకటే” అంటున్నారు. ఎంత అవివేకం. అసలు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే “అల్లాహ్” అను అరబిక్ పదముకు అర్ధం కేవలం దేవుడు అని. కాబట్టి ఒక్క బైబిలే కాదు ప్రపంచములో ఏ మతగ్రంధమైన అంటే పురాణాలైన, Book of Mormon లాంటివి మరేమైనా అరబిక్ లోకి అనువదించాలి అంటే ఆ పుస్తకములో దేవుడు అని వ్రాసిన ప్రతి ఒక్క చోట “అల్లాహ్” అని వ్రాయాల్సి వస్తుంది. కనుక అల్లాహ్ బైబిల్ నందే కాదు అన్నీ మతగ్రంధాలలో ఉన్నట్లే.మరి  మేము మహా మేధావులం అని చెప్పుకునే దావా ప్రసింగికులు దీనిని అంగీకరిస్తారో లేదో వారినే అడగాలి.

పైన విశ్లేషించిన సంగతులు కొన్ని ఉదాహరణకు మాత్రమే. కురాను నందు గల ఒంటరి దేవుడుకి, బైబిల్ నందు గల త్రిఏక దేవుడుకి వ్యత్యసాలు కోకొల్లలు.

Leave a Reply