పాత నిభందనలో దేవుని నామం యెహోవాగా వ్రాయబడింది, మరి క్రొత్తనిభందనలో యెహోవా నామము అసలు లేక పోవడానికి గల కారణాలు ఏవి?

మననదరికీ తెలిసిన విషయం ఏదనగా పాతనిభందన హీబ్రూ భాషలో వ్రాయబడింది  మరియు క్రొత్త నిభందన గ్రీకు భాషలో వ్రాయబడింది. “YHWH” (యెహోవా) అనే పదము హీబ్రూ భాష నుండి తీసుకోబడింది. క్రొత్త నిభందన వ్రాసిన గ్రీకు భాషలో దేవునిని “THEOS” అని పిలుస్తారు.

  1. మొదటి కారణం:

మన యేసయ్య తాను ఈ భూమి మీద నివసించిన సమయములో ఆయన శిష్యులతో గాని, అక్కడి ప్రజలతో గాని “ARAMIC” భాషలో మాట్లాడేవారు. గ్రీకు భాషలో మాట్లాడేవారు కారు. యేసయ్య “ARAMIC” భాషలో మాట్లాడేటప్పుడు, ఎప్పుడు తండ్రి అయిన దేవునిని హీబ్రూ భాషా పదము అయిన “యెహోవా” అని సంభోదించలేదు. తన తండ్రిని అరామిక్ భాష లో  “ABBA” అని పిలిచేవాడు. దీని అర్ధము తండ్రి అని.

ఒకవేళ యేసయ్య తండ్రి అయిన దేవునిని “యెహోవా” అని సంభోదించిననూ, క్రొత్తనిభందన వ్రాసిన ఆయన శిష్యులు తండ్రి అయిన దేవునిని యెహోవా అని వ్రాసెడివారు కాదు ఎందుకనగా, క్రొత్త నిభందన “ARAMIC” భాషలో వ్రాయబడలేదు “గ్రీకు” భాషలో వ్రాయబడినది . గ్రీకు భాషలో యెహోవాను “THEOS” గా తర్జుమా చేయబడినది. ఉదాహరణకు తెలుగులో ఉప్పును “ఉప్పు” అని వ్రాస్తాము అంతే గాని హిందీలో కూడా “ఉప్పు” అని వ్రాయము హిందీలో  “నమక్” అంటాము.

యెహోవా అనే నామం కూడా హీబ్రూ భాషా పదము, గ్రీకు పదము కాదు. క్రొత్త నిభందన వ్రాసిన గ్రీకు భాషలో దేవునిని “THEOS” అని పిలుస్తారు

2. రెండవ కారణం: యూదుల మూఢనమ్మకము 

యేసయ్య పరిచర్య కాలములోని యూదులు “యెహోవా” అను నామమును ఉచ్చరించటానికే బయపడేవారు. ఎందుకనగా వారికొక మూఢనమ్మకము కలదు అదేదనగా  యూదులకు ఇచ్చిన పది ఆజ్ఞ ల ప్రకారం, వారు యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అనేది వారి ఉద్దేశ్యం.

నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.

నిర్గమకాండము 20:7

ఈ పది ఆఙ్ఞలు పాతనిబంధనలోని న్యాయసూత్రములలో వున్న 613 ఆఙ్ఞల సారాంశమును సమకూర్చి ప్రాముఖ్యముగా విశ్లేషించినవి.

3. వేదాంత కారణము (Theological Reason):

దేవుని శిరస్సు నందు ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వం కలిగిన తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు కలరని మనందరికీ తెలిసిన విషయమే. వీరు వేరు వేరు వ్యక్తులుగా, వుండి విభజింపబడలేనటువంటి ఒక్క దేవునిగా ఏకమై, అద్వీతీయుడిగా ఉన్నాడని లేఖనములు చెబుతున్న సర్వ సత్యం. కనుక యెహోవా అనే దేవుని వ్యక్తిగత నామము తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు ముగ్గురుకీ చెందుతుంది. కేవలం ఒక్క తండ్రి అయిన దేవునికే కాదు.

ఒక వేళ యేసయ్య తండ్రి అయిన దేవునిని హీబ్రూ భాషలో “యెహోవా” అని పిలిచినట్లైతే ఆనాటి యూదులు, నేటి ప్రజలు, ఈ వ్యాసం చదువుతున్న మీరు , నేను కూడా దేవుని శిరస్సును , త్రిత్వమును, ఆయన సారమును, లక్షణములను అర్ధం చేసుకోలేకపోయేవాళ్ళం ఏమో?

Leave a Reply