ప్రపంచ జనాభా మొత్తంలో 31% క్రైస్తవులు ఉంటే, 23% ముస్లిములు ఉన్నారు. ఈ ముస్లిములు బైబిల్ దేవుడు, కురాను దేవుడు ఒకడే అని నమ్ముతారు. ఆశ్చర్యం కలిగించే విషయం యేదనగా ఈ ముస్లిములు ఒక పక్క బైబిల్ దేవుడు, కురాను దేవుడు ఒకడే అని నమ్ముతూనే, బైబిల్ దేవుని వాక్యం కాదని, యేసయ్య దేవుడు కాదని క్రైస్తవుల మీద బురధ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ముఖ్యులు తెలుగులో దావా చేస్తూ “నేను బైబిల్ పండితుడిని” అని వూదరగొడుతున్న మన UIRC షఫీ గారు. వీరి దేవుడైన అల్లాహ్ ని, వీరి ప్రవక్త అయిన ముహమ్మద్ ని ప్రకటించుకుంటే క్రైస్తవులుగా మాకు ఎటువంటి సమస్య లేదు గాని, మతం మత్తులో దేవుని ఊపిరి అయిన బైబిల్ ని దూషిస్తేనే అసలు సమస్య.
ప్రపంచ క్రైస్తవులు మొత్తం కూడా అంగీకరించే విషయం యేదనగా “ముహమ్మద్ దేవుని ప్రవక్త కానే కాదు అని”. ఎందుకనగా బైబిల్ స్పష్టముగా వివరించిన విషయం ఏదనగా “మన ప్రభువైన యేసయ్య దేవుని వద్ద నుండి పంపబడే చిట్ట చివరి ప్రవక్త మరియు ఆయన దేవుని ప్రియ సొంతకుమారుడు.
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను
రోమీయులకు 8:4
మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లురువిరి. మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
మత్తయి 21:33-37
పై వాక్యములో యేసయ్య చిట్టచివరిగా దేవుని వద్ద నుండి పంపబడే ప్రవక్త అని స్పష్టం అవుతుంది. ఈ వచనములో ఒక క్రమము స్పష్టముగా కనపడుతుంది అదేదనగా “దేవుడు మొదట దాసులను పంపాడు, తరువాత ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు చిట్ట చివరిగా దేవుని స్వంత కుమారుడైన మన యేసయ్యను పంపాడు”. యేసయ్య తరువాత ఇంకో దాసుడినో లేక ప్రవక్తనో దేవుడు పంపడు అని స్పష్టముగా దేవుని ఊపిరి అయిన బైబిల్ భోదిస్తుంది.
యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు
లూకా 16:16
పై వాక్యం బాగా పరిశీలిస్తే మనకు తెలిసేదేమనగా బాప్తీస్మం ఇచ్చు యోహాను కాలం వరకు ప్రవక్తలు మరియు ధర్మశాస్త్రం వుంది కాని యోహాను కాలం అనగా యేసయ్య జీవించి ఉన్న ఆ కాలం తరువాత దేవుని వద్ద నుండి ప్రత్యక్షంగా ప్రవక్తలు ఎవరు రారు అని.
అయితే బైబిల్ నందు దేవుని రాజ్యసువార్తను ప్రకటించే ప్రవక్తలను క్రొత్తనిభందన అపోస్తులుల కార్యములలో చూడవచ్చును.
అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి
అపో.కార్యములు 13:1
మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిర పరచిరి
అపో.కార్యములు 15:32
వీరు మన యేసయ్యచే దేవుని రాజ్యసువార్తను ప్రకటించే ప్రవక్తలను పంపబడ్డారు గాని, దేవుని వద్ద నుండి ప్రత్యక్షంగా పంపబడి పంపబడలేదు మరియు కొత్త ధర్మశాస్త్రం ఇవ్వనూ లేదూ. ఇందుకు భిన్నముగా ముహమ్మద్ మాత్రం రెండూ చేశాడు. “దేవుని వద్ద నుండి పంపబడిన గొప్ప ప్రవక్త అని తనంతట తాను చాటుకున్నాడు మరియు ముస్లిములకు కొత్త ధర్మశాస్త్రం (Sharia) ఇచ్చాడు. దీనినే షరియా లా (Sharia Law) అంటారు. మరి అయితే ఈ ముహమ్మద్ ఎవరు? ఈయన దేవుని ప్రవక్త కాకపోతే బైబిల్ నందలి విషయాలు ఎలా తెలుసుకోగలిగాడు అన్న అనుమానాలు ప్రతి ఒక్కరికి రాక తప్పదు.
దేవుని ఆత్మ ద్వారా నడింపింపబడి సత్యాన్ని తెలుకుందాం ఇప్పుడు.
HIJAZ ప్రాంతంలో వాడుకలో బైబిల్:
ముహమ్మద్ క్రీ. శ 570 లో జన్మించి, క్రీ. శ 632 సంవత్సరములో మరణించాడు. అంటే ఈయన జీవించిన కాలం 62 సంవత్సరాలు. ఈయన జీవించి, మరణించిన HIJAZ ప్రాంతంలో (సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలో) బైబిల్ వాడుకలో ఉన్నది అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అంతే కాదు ఈ ప్రాంత ప్రజలకు హిబ్రీ భాషలో అనువదించే సామర్ధ్యం కలదని ఇస్లాం మతగ్రంథమైన హదీతులు (Hadith) మనకు తెలుపుతున్నాయి. జనాలు పిచ్చోళ్ళు అనో లేక, అజ్ఞానవంతులు అనో గాని దావా బోధకులు వారి ప్రసంగాలలో చెప్పేది ఏమనగా “ముహమ్మద్ కాలములో బైబిల్ అనువాదం జరగలేదు, ఇంకా ముహమ్మద్ చదువుకోని నిరక్ష్యరాసుడు కనుక ముహమ్మద్ కి బైబిల్ గురించి ముందే తెలిసే అవకాశమే లేదు”. వీరిలో ముఖ్యులు మన IREF అధ్యక్షుడు జాకీర్ నాయక్. ఈయన గారి వాదనలు ఏవనగా “పాత నిబంధన క్రీ.శ 900 మరియు కొత్త నిబంధన క్రీ. శ 1616 లో అనువాదం చేశారు కనుక ముహమ్మద్ ఖచ్చితంగా కురాను బైబిల్ నుండి సంగ్రహించబడలేదు అని. ఒక పక్క ఈయన గారి మత గ్రంథమైన హదిత్ ముహమ్మద్ కాలములో బైబిల్ వాడుకలో ఉంది అని చెబుతుంటే, లేదు కాదు అని ఈయన గారు వాదించటం ఏమైనా భావ్యమా?. అంతే కాదు ఈ రోజు ఎంతో మంది నిరక్ష్యరాసులు, బైబిల్ చదవటం రాకపోయినప్పటికి వారి వారి సంఘాలలో బోధకుల యొక్క బోధనలు వింటూ దేవుని జ్ఞానం నేర్చుకున్నవాళ్లు కోకొల్లలు. ఈ విధముగా బైబిల్ నందలి దేవుని జ్ఞానం ముహమ్మద్ తన భార్య అయిన ఖదీజ యొక్క Uncle, waraqa bin Naufal (వరాక బిన్ నాఫల్) దగ్గర నేర్చుకొని బైబిల్ నందలి విషయాలను కురానులోకి మళ్లించటం ముహమ్మద్ కి వెన్నతో పెట్టిన విద్య.
ఇంకా లోతుగా ఈ విషయాలన్నీ పరిశీలిద్దాం.
అయేషా ఈలాగు చెప్పెను“ప్రవక్త గుండె వేగముగా క్రొట్టుకునేటప్పుడు, ఆయన తన భార్య అయిన ఖదీజా దగ్గరికి వచ్చాడు. ఆమె ప్రవక్తని (ముహమ్మద్ ని) waraqa bin Naufal (వరాక బిన్ నాఫల్) దగ్గరికి తీసుకొనివచ్చెను, ఈయన (waraqa bin Naufal) క్రైస్తవ్యం స్వీకరించిన వ్యక్తి. ఈయన అరబిక్ భాషలో సువార్తలు (Gospels) చదివేవాడు
Sahih Al-bhukari: Volume 04, Book 55, Number 605
waraqa (వరాక బిన్ నాఫల్) ఇస్లాం మతం స్దాపించక మునుపు క్రైస్తవ్యం స్వీకరించిన వ్యక్తి, ఈయన అల్లాహ్ యొక్క కోరిక మేరకు సువార్తను అరబిక్ భాషలో వ్రాసెడివాడు. ఈయన చాలా వృద్దుడు, ఈయన యొక్క కనుచూపు కూడా నశించిపోయింది
Sahih Al-bhukari: Volume 06, Book 60, Number 478
AbuHurayrah (అబుహురాయ్ రాహ్) ఈలాగు చెప్పెను“Ka’b Torah (మోషే వ్రాసిన ఐదు కాండాలు) చదివి ఈలాగు చెప్పెను “అల్లాహ్ యొక్క ప్రవక్త సత్యమే పలికెను
Sunan Abu Dawood Book 03, Number 04
ఖదీజ అతనిని (ముహమ్మద్ ని) వెంటబెట్టుకుని waraqa bin Naufal bin Asad bin Abdul Uzza (Waraqa bin Naufal) (వరాక బిన్ నాఫల్) దగ్గరికి తీసుకునివెళ్ళెను. ఈయన (Waraqa bin Naufal) ఇస్లాం మతం స్దాపించక మునుపు క్రైస్తవ్యం స్వీకరించిన వ్యక్తి, ఈయన హెబ్రీ భాషలో అక్షరములను వ్రాసేవాడు. ఈయన అల్లాహ్ యొక్క కోరిక మేరకు సువార్తను అరబిక్ భాషలో వ్రాశాడు
Sahih Al-bhukari: Volume 01, Book 01, Number 03
పై హదిత్ వచనములను కొంచెం అన్వేషిస్తే మనకు తెలిసే ముఖ్యమైన విషయాలు ఏమనగా. ముహమ్మద్ కాలము నాటి ప్రజలకు హెబ్రీ, గ్రీకు భాషలు తెలుసు, మోషే రాసిన Torah (ఐదు కాండాలు) మరియు Gospels (సువార్తలు) కూడా తెలుసు. ఇంకా వీరికి గ్రీకు భాషలో ఉన్న సువార్తలను అరబిక్ భాషలో అనువాదం చేయగల సామర్ధ్యం ఉన్నదని స్పష్టం అవుతుంది.
waraqa bin Naufal (వరాక బిన్ నాఫల్) అనే ముహమ్మద్ భార్య యొక్క Uncle “బైబిల్ పండితుడు అని తెలుస్తుంది” అంతే కాదు ఈయనకు గ్రీకు భాష నుండి అరబిక్ భాషలోనికి అనువధించే సామర్ధ్యం కూడా కలదని స్పష్టం అవుతుంది. కనుక ఇక్కడే మొదలైంది అసలు కథ. అదేమిటో చూద్దాము.
అసలు ఈ “waraqa bin Naufal” (వరాక బిన్ నాఫల్) ఎవరు. ఈయన ముహమ్మద్ యొక్క మొదటి భార్య అయిన ఖదీజ యొక్క రక్త సంభందీకుడు (Uncle). హదీత్ లను (Sahih Bukhari, Volume 1, Book 1, Number 3) పరిశీలిస్తే మనకు రెండు విషయాలు తెలుస్తున్నాయి.
ఖదీజ అతనిని (ముహమ్మద్ ని) వెంటబెట్టుకుని waraqa bin Naufal bin Asad bin Abdul Uzza (Waraqa bin Naufal) (వరాక బిన్ నాఫల్) దగ్గరికి తీసుకునివెళ్ళెను. ఈయన (Waraqa bin Naufal) ఇస్లాం మతం స్దాపించక మునుపు క్రైస్తవ్యం స్వీకరించిన వ్యక్తి, ఈయన హెబ్రీ భాషలో అక్షరములను వ్రాసేవాడు. ఈయన అల్లాహ్ యొక్క కోరిక మేరకు సువార్తను అరబిక్ భాషలో వ్రాశాడు
Sahih Bukhari, Volume 1, Book 1, Number 3
ఆవేమనగా. ముహమ్మద్ తన కుటుంబాన్ని క్రమముగా దర్శించటంలో ఆసక్తి కలవాడని తెలుస్తుంది. ముహమ్మద్ తన బంధువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడని తెలుస్తుంది. ముహమ్మద్ కు మొదటి సారిగా అల్లాహ్ ప్రత్యక్షత రాక మునుపు నుండే ముహమ్మద్ మత సంభంద విషయాలలో అధిక ఆసక్తి కలవాడని హదీత్ (Hadit) ద్వారా స్పష్టం అవుతుంది. ఏ విదముగా అంటే అల్లాహ్ ప్రత్యక్షత (First Revelation) రాకమునుపే ముహమ్మద్ హీరా (Hira) కొండ గుహలలో అల్లాహ్ కు ప్రార్ధన చేసేవాడు. ఇటువంటి మత ఆసక్తి ఉన్న ముహమ్మద్ తన భార్య ఖదీజాతో ఉన్న వివాహబంధము మూలముగా, అల్లాహ్ ప్రత్యక్షత (First Time Revelation) రాక ముందు వరకు అనగా (25 స,లు వయసు నుండి 40 స.లు వయసు వరకు) 15 సంవత్సరాలు పాటు బైబిల్ నందలి విషయాలను తన భార్య అయిన ఖదీజ యొక్క Uncle, waraqa bin Naufal దగ్గర నేర్చుకొని వాటిని కురానులోనికి మళ్లించాడు అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి మనకు.
Leave a Reply