యుక్తవయసులో ఉన్న యవ్వనస్ధులకు దేవుని ప్రేమకు దగ్గరవుతున్న సమయములో మొట్టమొదటిసారిగా, వారు ఎదుర్కొనే కష్టతరమైన విషయమేదనగా “అశ్లీలత్వము (Pornography)” దాని వలనకలిగే “జారత్వము (Adultery)”. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం రోజుకు సుమారు 4 కోట్ల మంది అశ్లీల websites చూస్తూ ఉన్నారు అంటే పరిస్ధితి ఎంత దారుణముగా ఉన్నదో మనం అర్ధం చేసుకోవచ్చ్చు. ప్రస్తుతమున్న పరిస్దితుల్లో, ఈ ఇంటర్నెట్ యుగములో రోజూ ఉపయోగించే సమాచార సాధనములలో, వార్తా పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో (Social Networks) అశ్లీల చిత్రాలు సర్వసాధారనమైపోయింది.
అశ్లీలత అనగా ఏమి?
ఏదైనా చిత్రపటము లేక స్వరము ఒక వ్యక్తిని లైంగికముగా ప్రేరేపిచినప్పుడు దానిని అశ్లీలత అంటారు.
బైబిల్ ఆశ్లీలతను గూర్చి ఏమని బోధిస్తుంది?
ఆశ్లీలతను, జారత్వమును గూర్చి బైబిల్ బోధించిన విధముగా ప్రపంచములో ఏ మతగ్రంధము వివరించలేకపోయింది. బైబిల్ మనకు చాల స్పష్టముగా వివరిస్తుంది “అశ్లీలత మహా ఘోరమైన పాపము“
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
సామెతలు 6:32
- అశ్లీలతకు దూరముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
1కోరింథీయులకు 6:18
- ఆశ్లీలతను ప్రేమించేవాడు దేవుని రాజ్యమునకు దూరముగా ఉంటాడని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది.
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను, దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
1కోరింథీయులకు 6: 9,10
- త్రిత్వములో మూడవ వ్యక్తీ అయిన పరిశుద్ధాత్మ దేవునికి, మన దేహం ఆలయమై ఉన్నది అని, ఈ మన దేహముతో దేవునిని మహిమ పరచమని బైబిల్ మనకు వివరిస్తుంది.
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి
1కోరింథీయులకు 6: 19, 20
దేవుని చిత్తము ఏమిటి?
మనం పరిశుద్దులుగా వుండి, అశ్లీలతకు, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని అభీష్టం అని ప్రతి ఒక్కరము మన హృదయములో బద్రపరచుకోవలెను.
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
1థెస్సలొనికయులకు 4:3
అశ్లీలత మరియు జారత్వము వలన కలుగు దుష్పలితాలు
అశ్లీలత మరియు కాముకత్వము కారణముగా మన కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది.
- భర్తలు అశ్లీలత కారణముగా పరస్త్రీల వైపు ఆకర్షితులై వివాహేతర సంభందమునకు దారి తీసి వారిద్దరి మద్య ఎడబాటుకు కారణం అవుతుంది. బైబిల్ మనకి చాల స్పష్టముగా ఈ విధముగా వివరిస్తుంది “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి” (ఎఫెసీయులకు 5:25)
- అశ్లీలత ఒక పురుగు వంటిది అది మన జీవితాలను తినివేస్తుంది.
- అశ్లీలత కుటుంబములలో ఉన్న భందాలను తెంచి వేస్తుంది.
- అశ్లీలత ఒక వ్యసనము నువ్వు ఎంతగా దానిని ప్రేమిస్తావో అంతగా నీ స్వంత నాశనమును కోరుకోనుచుంటావు.
- అశ్లీలత కారణముగా యువకులు విద్యావిహీనులగుదురు.
- అశ్లీలత మూలముగా అత్యాచారాలు, హత్యలు, వ్యభిచారములు, హింసకు దారి తీయవచ్చు .
అశ్లీలతకు, జారత్వమునకు దూరముగా ఉండుట ఎలా?
- మొట్టమొదటి సారిగా మనము చేయవలసిన పని ఏదనగా అశ్లీలతకు , జారత్వమునకు కారణమయ్యే ప్రతి సాధనమునకు దూరముగా ఉండాలి.
ఉదాహరణకు మీకు ఉదయాన్నే చూసే వార్తా పత్రిక నందు ఏదైనా చిత్రము వలన మీరు బలహీనులై జారత్వము చేయుచున్నారా. ఆ చిత్ర భాగము గల పేపరును త్రిప్పి వేసేయండి, పొరపాటున కూడా అపవాదికి అవకాశము ఇవ్వకండి. ఏదైనా FACEBOOK గ్రూప్ వలన గాని, FACEBOOK friend పోస్ట్ చేసే చిత్రాల వలన మోహము కలిగినా వెంటనే ఆ Facebook group నుండి exit అయిపోండి,ఆ friend ని unfriend చేసేయండి.
- చాల మంది నుండి నేను ఈ సమాధానము వింటూ ఉంటాను “నేను ఎంతో ప్రయత్నిస్తాను గాని, నాలో ఉన్న బలహీనత మూలముగా Adultery కి Pornography దూరము కాలేకపోతున్నాను” అని, ఇది ఎంత మాత్రము నిజము కాదు. మిమ్మల్ని ఒక తీవ్రవాది ఒక గదిలో భందించి “నువ్వు Pornography చూస్తే నిన్ను చంపేస్తా అంటే, మీలో ఎవరైనా చూడగలరా? ఎవరూ చూడలేరు. ఎందుకు చూడలేరు? ఎందుకంటే మీ ప్రాణము పోతుందని భయము. అదే భయము మనం నమ్మే దేవుని మీద ఉంటే మనం పదే పదే Pornography చూడగలమా?
- జారత్వమును గూర్చి, దేవుని చిత్తమును గూర్చి పైన పేర్కొన్న వచనములు ధ్యానిస్తూ ఉండండి.
- యేసయ్య శిలువపై చేసిన త్యాగమును గుర్తు చేసుకోండి, ఆయన దేవుడై వుండి నీ కొరకు చనిపోయాడు చూడు అంత గొప్ప త్యాగాని కంటే ఈ లోకసంబందమైన జారత్వము , అశ్లీలత గొప్పది కాదు అని పదే పదే గుర్తు చేసుకోండి.
- యేసయ్య చాలా స్పష్టముగా కొండమీద ప్రసంగములో చెప్పాడు
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
మత్తయి 5:28
కాబట్టి జారత్వము , అశ్లీలత ఘోరమైన పాపమూ అని పదే పదే మీ మనసుకు చెప్పుకోండి.
- ఇక చివరిగా ! దిగులు పడకండి, పరిశుద్దాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఒక్కసారి ఆయనను వేడుకోండి, శోధనలు జయించే శక్తిని ఇవ్వమని అడగండి. ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.
2తిమోతికి 1:7
Leave a Reply