భార్య భర్తలు విడాకులు తీసుకోవచ్చునా?

ఈ రోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది వివాహం చేసుకున్నవారు చిన్న విషయం, పెద్ద విషయం అని తేడా లేకుండా వారి వివాహ భందాన్ని తెగదెంపులు చేసేసుకుంటున్నారు. ఇదే పరిష్కారం అని మానవులుగా వారి అభిప్రాయం. ఇంకా బాధించదగిన విషయం ఏదనగా కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో భార్య, భర్తల మధ్య భేదాలు వచ్చినపుడు మన సంఘపెద్దలు, సంఘకాపరులు కూడా “విడాకులే” వారి సమస్యకు పరిష్కారం అని నిర్ణయిస్తారు. అయితే ఈ విషయంలో దేవుని చిత్తం ఏమిటో అని మనం పరిశీలించినయెడల, దేవుని వూపిరి అయిన బైబిల్ నందు పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడింది ఏమనగా “భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇస్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” (మలాకీ 2:16).

బైబిల్ ప్రకారం వివాహం అన్నది “జీవితం అంతం వరకు వుండే భందం”.కారణం ఏదైనప్పటికీ భార్య, భర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు. అన్నిటికీ పరిష్కారం మన యేసయ్య ఆయనకు సమస్తము సాద్యమే.

యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

మత్తయి 19:26

కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.

మత్తయి 19:6

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఆదికాండము 2:24

ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు

ఎఫెసీయులకు 5:31

పాపులమైన మనము మన జీవితంలో పాపం చేయకుండా ఉండలేము అని సమస్తజ్ఞాని అయిన దేవునికి ముందే తెలుసు. ఆదాము ద్వారా పాపం ఈ లోకములోనికి ప్రవేశించింది కనుక, పాపులమైన మనము పాపము చేస్తూనే వున్నాము.

ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

రోమీయులకు 5:12

ఈ పాపము మూలముగా దేవుడు ఒక్క విషయములో విడాకులు తీసుకోటానికి మానవునికి అనుమతి ఇచ్చాడు. అదే పాపము వలన ఈ లోకములోకి వచ్చిన “వ్యభిచారం”, “లైంగిక అనైతికత”, “జారత్వము” లేక “వివాహేతర సంభందం”.

ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమె యందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని యింటనుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.

ద్వితీయోపదేశకాండం 24:1-2

వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలమైనది గాను వుండవలెను అని దేవుడు మనకు సెలవిచ్చిన ప్రకారం వివాహం భందం ఎంతో పరిశుద్దమైనది.

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును

హెబ్రీయులకు 13:4

అయితే ఈ రోజుల్లో ఎన్నో అసహ్యమైన వివాహేతర సంభందాల గురించి వార్తా పత్రికలలో, TV లలో, మన నిజ జీవితాలలో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం వీరికి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. మన జీవిత భాగస్వామి వేరొకరితో వివాహేతర సంభందం పెట్టుకున్నారు అని తెలిసినపుడు మన గుండె పగిలిపోతుంది. ప్రతి ఒక్కరికీ తన భాగస్వామి యొక్క ప్రేమ వారికే చెందాలి అని కోరిక వుంటుంది. ఇలాంటి సందర్భములో దేవుడు మానవుని హృదయ కాఠిన్యమును బట్టి , వారి బాధను బట్టి “విడాకులు” తీసుకోటానికి వారికి అనుమతి ఇచ్చాడు. కాబట్టి భార్య భర్తలు విడాకులు తీసుకోవాలి అనుకుంటే దానికి కారణం ఒక్కటే అయివుండాలి అదే “వివాహేతర సంభందం”.

కారణం ఏదైనా “విడాకులు దేవునికి అసహ్యమైన క్రియయని బైబిల్ మనకి భోదిస్తుంది” (మలాకీ 2:16). మరి దేవుడెందుకు “వివాహేతర సంబంధం” విషయములో విడాకులను అనుమతిచ్చాడు అంటే మన హృదయ కాఠిన్యమును బట్టియే. అయితే దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొనిన యెడల తిరిగి మన వివాహ భందాన్ని దృడపరుచుకోవచ్చు, దేవుని చిత్తం నెరవేర్చవచ్చును.

కాబట్టి, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

ఎఫెసీయులకు 4:1-3

అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి యున్నాడు.

1 కొరింతీయులకు 7:15

ఈ వాక్యం విడాకుల గురించి చెప్పట్లేదు గాని. విశ్వాసులు దేవుని కోసం అవిశ్వాసులను విడిచిపెట్టవలసి వస్తుంది అని మనకి భోదిస్తుంది. అయితే అవిశ్వాసుల కొరకు ముందుగా మనం ప్రార్ధించాలి.

అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

1 కొరింతీయులకు 7:14

మన ప్రార్ధన ద్వారా వారిలో మార్పు రావొచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే (మత్తయి 19:26).

Leave a Reply