యేసయ్య స్పృష్టి కర్త లేక? దేవునిచే స్ప్రుష్టించబడినవాడా?

యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాడు.

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.

కొలస్సీయులకు 1:16

అయితే ఈ రోజు అనేకమైన క్రీస్తు విరోధులు యేసయ్యను ఒక గొప్ప వ్యక్తిగా, ప్రవక్తగా, భోదకునిగా అంగీకరిస్తూనే యేసు ప్రభువుని దేవునిచే స్ప్రుష్టించబడిన ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు . వీరిలో ముఖ్యులు ముస్లింలు, యెహోవా సాక్షులు, MORMONలు. ఈ అంశము ఈ రోజు లేవనెత్తిన అంశం కాదు. మొదటి శతాబ్దపు సనాతన క్రైస్తవ్యం యేసయ్య స్ప్రుష్టికర్తే గాని, స్ప్రుష్టించబడిన వాడు కాదని దేవుని ఊపిరిచే కలిగిన బైబిల్ ద్వారా నిరూపించగలిగారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ మత సంక్షేపములో (Creeds of the Church) యేసయ్య స్ప్రుష్టించబడిన వాడు కాదని స్ప్రుష్టి కర్త అని గట్టిగా వాదించబడినది.

  • ముస్లింలు చెప్పేదేమనగా “యేసు ప్రభువు వారు ఒక సామాన్య మానవ ప్రవక్త”. ఈయన అల్లాహ్ అనే దేవుని ద్వారా అద్భుతమైన రీతిలో జన్మించాడు.
  • MORMONలు, Arianism చెప్పేదేమనగా “తండ్రి అయిన దేవునికి ఏ విధముగా ఆది (Beginning) కలదో, యేసు ప్రభువు వారికి కూడా ఆది (Beginning) కలదు” అని.
  • ఇంకా యెహోవా సాక్షులు చెప్పేదేమనగా ” యేసయ్య యెహోవా దేవుని మొదటి స్ప్రుష్టి అని”, ఆయనకు మిఖాయేలు దూత అను పేరు కూడా కలదు అని చెబుతారు.

వీరి వాదనలన్నీ ఒక సారి ప్రక్కన పెట్టి యేసయ్య స్ప్రుష్టికర్త లేక స్ప్రుష్టించబడిన వాడా అని తెలుసుకోవటానికి మనకి ఒక్కడే ఆధారం ఆయనే మన మెస్సీయ “యేసు ప్రభువు” వారు. యేసయ్య తన పరిచర్యలో పదే పదే ఆయనకు దేవునికి మాత్రమే కలిగిన లక్షణాలు కలవని, స్ప్రుష్టించబడిన వాడు కాదని స్పృష్టి కర్త అని సాక్ష్యాలతో నిరూపించుకున్నాడు.

విశ్రాంతి దినమునకు ప్రభువు:

అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.

మార్కు 2:28

విశ్రాంతి దినము దేవుడు నియమించిన ముఖ్యమైన పది ఆజ్ఞలలో ఒకటి. అయితే ఇక్కడ యేసయ్య మాత్రం తాను విశ్రాంతి దినమునకు ప్రభువును అని సెలవిస్తున్నాడు. ముస్లింలు ఎవరైతే యేసయ్య దేవుడు కాదు , దేవుని ప్రవక్త మాత్రమే అని చెప్పేవారు , వారి కురానులో గాని , దేవుని వూపిరి అయిన బైబిల్ లో గాని, ఏ ప్రవక్త అయిన “నేను విశ్రాంతి ధినమునకు ప్రభువు” అని ప్రకటించారని చూపగలరా. మీరే ఆలోచించుకోవాలి.

తండ్రితో సమానమైన మహిమను కలిగి ఉండుట:

తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.

యోహాను 17:5

స్ప్రుష్టికర్త అయిన దేవునికే పరిమతమైన ఆరాధనను యేసయ్య స్వీకరించుట:

అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.

మత్తయి సువార్త 14: 33

భవిష్యత్తులో యేసయ్య తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై లోకమునకు తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నాడు.

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

మత్తయి 25:31

ఇక్కడ యేసయ్య దేవుడు మాత్రమే కూర్చునే మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నాడు. ఈ విధముగా దేవుని సింహాసనము మీద కూర్చుని తీర్పు తీర్చే ఒక సామాన్య ప్రవక్తని ముస్లిములు వారి కురానులో చూపగలరా!

యేసయ్య, వ్యక్తిగతంగా కేవలం దేవుడు మాత్రమే క్షమించగలిగిన, ఒక పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలన్నిటిని తీసివేసాడు.

నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారుపాపములు క్షమించుచున్న యితడెవడని తమలోతాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.

లూకా 7:48

ఆయన ఎవరో ఒక ప్రవక్త లేక దేవుడా అనే అనుమానం ఆరోజు భోజన పంక్తిని కూర్చుండినవారికి వచ్చినట్లుగా ఈ రోజు మన ముస్లిం సహోదరులకు రావడం లేదు.

యేసయ్య తో పాటు 3 సంత్సరాలు పరిచర్య చేసిన శిష్యులు ఆయన స్పృష్టి కర్త అని తెలుసుకున్నారు , ఆయనను ఆరాధించారు:

  • యేసయ్య ప్రియ శిష్యుడైన యోహాను “ఆయన ఆది యందు వున్నవాడు అన్నాడు” (యోహాను 1: 1).
  • మరొక శిష్యుడైన తోమ “నా దేవా , నా ప్రభువా” (యోహాను 20:28) అని యేసయ్య వద్ద మోకరిల్లాడు .
    ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం యేదనగా , బైబిల్ లో అనేకమైన చోట్ల మనుష్యులు దేవదూతలకు, ప్రవక్తలకు మ్రొక్కినపుడు వారు వారించి మాకు మ్రొక్క కూడదు సర్వస్పృష్టి కర్త అయిన దేవునికే ఆ ఘనత చెందాలి అని వారిని నివారించారు . యేసయ్య మాత్రం అధ్భుతముగా తనని దేవుడు అన్న తోమా ను ఏమాత్రం వారించలేదు, ఇంకా “నీవు నన్ను చూచి (దేవుడని) నమ్మితివి చూడక నమ్మని వారు ధన్యులు” (యోహాను 20:29) అని యేసయ్య సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మనం ఆయనను ప్రత్యక్షముగా చూడకయే ఆయనను దేవుడని నమ్ముతున్నాం కనుక మనం ధన్యులం.
  • అపోస్తులుడైన పౌలు మన యేసయ్యను సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు మరియు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు నందు నివసిస్తుంది అని భోదిస్తున్నాడు.

పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి, నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

రోమీయులకు 9: 5

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.

కొలస్సయులకు 2: 9
  • మరొక శిష్యుడైన పేతురు యేసయ్యను గురించి భోదించింది యేమనగా “యేసయ్య నందు విశ్వాసముంచువాడు ఆయన మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తున్నారు అంటున్నాడు. ముస్లిములు చెప్పినట్లుగా యేసయ్య ఒక సామాన్య ప్రవక్త అయితే “ప్రవక్తలందరూ యేసయ్య మూలముగా పాపక్షమాపణ పొందునని, ఈ విధమైన సాక్ష్యం ఎందుకిస్తారు.

ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

అపొ. కార్యములు 10: 43

దేవుని స్వంత కుమారుడైన యేసయ్య:

దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను

రోమీయులకు 8: 4

దేవుని స్వంత కుమారుడైన యేసయ్య  స్పృష్టికర్తే గాని స్పృష్టించబడిన వాడు కాదు. ఆయన ఎల్లపుడూ నిరంతరం వుండేవాడు. ఆయనకు ఆదియు , అంతము లేవు (యోహాను 1:1, ప్రకటనలు 1:18 & 22: 13 ) ఆయన సర్వాధికారి అయిన దేవుడు (రోమీయులకు 9: 5).

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను

ఫిలిప్పీయులకు 2: 6 – 7

ఆయన మన కొరకు దేవుడై వుండి కూడా, తన్నుతాను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని, పాపపరిహారార్ధ బలిగా శిలువపై అర్పించాడు. అంతే గాని ఆయన స్పృష్టించబడిన వాడు కాదు. మనమందరం ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకుందాం.

Leave a Reply